సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 24 ఫిబ్రవరి 2022 (13:08 IST)

హనుమకొండ జడ్పీ హైస్కూల్‌లో ప్రమాదం

హనుమకొండ జిల్లాలో జడ్పీ హైస్కూల్‌లో హైస్కూల్‌లో  ప్రమాదం చోటుచేసుకుంది. పాఠశాలలోని ఓ తరగతి గదిలో పై కప్పు పెచ్చులు ఊడిపడ్డాయి. 
 
ఈ ఘటనలో విద్యార్థులకు గాయాలయ్యాయి. పైకప్పు పెచ్చులు అకస్మాత్తుగా ఊడిపడటం వల్ల ఐదుగురు విద్యార్థినులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని పాఠశాల యాజమాన్యం స్థానిక ఆస్పత్రికి తరలించింది.
 
హనుమకొండ జిల్లా హసన్‌పర్తి జడ్పీ హైస్కూల్‌లో ప్రమాదం జరిగింది. పాఠశాలలోని ఓ తరగతి గదిలో పైకప్పు పెచ్చులు ఊడిపడి విద్యార్థులకు గాయాలయ్యాయి.  
 
మరోవైపు పాఠశాలలో జరిగిన ఈ ఘటన గురించి తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లల ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతున్నారు.