బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 24 ఫిబ్రవరి 2022 (12:32 IST)

ఉక్రెయిన్‌లోని ఏపీ విద్యార్థులను సురక్షితంగా రప్పించండి

ఉక్రెయిన్‌లోని ఏపీ విద్యార్థులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడానికి ఏపీ సీఎం  జ‌గ‌న్ చ‌ర్య‌లు చేపట్టారు. ఇందులో భాగంగా కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ కు లేఖ రాశారు. 
 
ఈ విష‌యంలో ఏపీ నుంచి ఎలాంటి స‌హ‌కారం అందించ‌డానికైనా తాము సిద్ధంగా ఉన్నామ‌ని జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు. యుక్రెయిన్‌లోని ఏపీ విద్యార్థుల‌ను త‌క్ష‌ణ‌మే సుర‌క్షితంగా వారి స్వ‌స్థ‌లాల‌కు చేర్చాల‌ని జ‌గ‌న్ కోరారు.
 
ఏపీ ప్రభుత్వం నిత్యం కేంద్ర విదేశాంగశాఖతో టచ్‌లో ఉంది. వాళ్లని వెనక్కి తీసుకురావడంలో కావాల్సిన సహకారం కోసం ఢిల్లీలోని ఏపీ భవన్‌, ఇక్కడి సీఎంవో అందుబాటులో ఉంటుంది. 
 
యుక్రెయిన్‌లోని ఏపీ విద్యార్థులతో ప్రభుత్వం టచ్‌లో ఉంది. కేంద్రం సూచించిన మేరకు వారంతా వెనక్కి రావడానికి మా వంతు సహకారం అందిస్తున్నామని సీఎం జగన్‌ చెప్పారు.