గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (13:19 IST)

సీఎం జగన్ పాలన.. ఆర్ఖిక సంక్షోభంలో ఏపీ.. యనమల ఫైర్

రాష్ట్రంలో మునుపెన్నడూ లేని ఆర్థిక సంక్షోభం నెలకొందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు తెలిపారు. ఏపీ సీఎం జగన్ రెడ్డి మూడేళ్ల పాలనలో ఏపీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని చెప్పారు. దీనికి ముమ్మాటికీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనే కారణమని దుయ్యబట్టారు. 
 
శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... జగన్ రెడ్డి అహంభావం, చేతగానితనం, మొండితనంతోనే ఈ అనర్ధం జరిగిందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బహిరంగ మార్కెట్ రుణాలతో సహా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం 3 ఏళ్లలో టీడీపీ హయాం కంటే రూ.86,865 కోట్లు అధికమని తెలిపారు. కేంద్ర నిధులు కూడా కలిపితే రాష్ట్ర ప్రభుత్వ మొత్తం ఆదాయం రూ.1,25,995 కోట్లు ఎక్కువ వచ్చిందన్నారు.
 
ఆదాయంలో అనేక రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్ మెరుగ్గా ఉందని యనమల వెల్లడించారు. పనితీరులో, వివిధ శాఖల పురోగతిలో మాత్రం అట్టడుగున ఉందని విమర్శించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కోవిడ్ ప్రభావం ఏపీపై తక్కువే అని అన్నారు