మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (18:32 IST)

విద్యార్థులకు భోజనం వడ్డించిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి శుక్రవారం స్వయంగా భోజనం వడ్డించారు. ఆయన శుక్రవారం గుంటూరు జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మంగళగిరి జిల్లా ఆత్మకూరులో ఇంటర్నేషనల్ సొసైటీ  ఫర్ కృష్ణ కన్సీసిస్నెస్ (ఇస్కాన్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అక్షయ పాత్ర సెంట్రల్ కిచెన్‌ను ఆయన ప్రారంభించారు. 
 
ఈ సెంట్రల్ కిచెన్‌ను సీఎం జగన్ ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన పలువురు విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించారు. ఆ తర్వాత హరే కృష్ణ గోకుల్ క్షేత్ర నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. దీన్ని రూ.70 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు.