శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Updated : సోమవారం, 7 మార్చి 2022 (23:46 IST)

ద్రాక్ష తీసుకుంటే ఫలితాలు ఏమిటి?

ఆకుపచ్చ లేదా ఎరుపు ద్రాక్ష కంటే కొన్ని రకాల నల్ల ద్రాక్షలో యాంటీఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ రసాయన సమ్మేళనాలు శరీర కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి.
 
క్యాన్సర్, మధుమేహం, అల్జీమర్స్, పార్కిన్సన్స్, గుండె జబ్బులు వంటి వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. అనారోగ్యం నుండి త్వరగా కోలుకోవడానికి కూడా సహాయపడతాయి.

 
ఆహారంలో ద్రాక్షను ఎలా చేర్చుకోవాలి
తాజా ద్రాక్ష నుండి రసం తీసుకుని చక్కెర లేకుండా 100% ద్రాక్ష రసాన్ని త్రాగవచ్చు. అలాగే గ్రీన్ సలాడ్ లేదా ఫ్రూట్ సలాడ్‌లో ద్రాక్షను జోడించి తీసుకోవచ్చు. వేసవిలో పుల్లపుల్లగా తీయతీయగా వుండే ద్రాక్షరసం తీసుకుంటూ వుంటే డీహైడ్రేషన్ కాకుండా వుంటుంది.