ఆదివారం, 17 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 11 జనవరి 2022 (21:23 IST)

ఇండియన్‌ డైటిటిక్‌ అసోసియేషన్‌తో కలిసి డైటిటిక్స్‌ డే 2022ను వేడుక చేసిన ఎస్పెరర్‌ న్యూట్రిషన్‌

సరైన డైట్‌, న్యూట్రిషన్‌, చక్కటి ఆరోగ్యం పట్ల సమాజానికి అవగాహన కల్పించడంలో భాగంగా ఇండియన్‌ డైటిటిక్‌ అసోసియేషన్‌ (ఐడీఏ) 2013 నుంచి డైటిటిక్స్‌ డేను దేశవ్యాప్తంగా నిర్వహిస్తుంది. పరిశోధనాధారిత గ్లోబల్‌ క్లీనికల్‌ న్యూట్రిషన్‌ సంస్థ ఎస్పెరర్‌ న్యూట్రిషన్‌ ఈ సంవత్సరం ఐడీఏతో కలిసి హైదరాబాద్‌లోని హయత్‌ ప్లేస్‌ హోటల్‌లో ఈ వేడుకలను నిర్వహించింది. నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ డైరెక్టర్‌ ఆర్‌ హేమలత ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరయ్యారు.

 
ప్రతి సంవత్సం ఐడీఏ సూచనలకనుగుణంగా అవగాహన కల్పించేందుకు విభిన్న నేపథ్యాలను ఎంచుకుంటుంటారు. దీనిలో భాగంగా ఆ అంశాలపై పలు ఉపన్యాసాలు, వాక్స్‌, పోటీలను ఫెయిర్స్‌, బుక్‌ స్టోర్లు, కేఫ్‌లు, స్కూల్స్‌, హాస్పిటల్స్‌లో నిర్వహిస్తున్నారు.

 
హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్పెరర్‌ న్యూట్రిషన్‌ ఫౌండర్‌ అండ్‌ సీఈవో రక్తిం చటోపాధ్యాయ మాట్లాడుతూ ‘‘సరైన డైట్‌, న్యూట్రిషన్‌, చక్కటి ఆరోగ్యం పట్ల తగిన అవగాహన కల్పించేందుకు ఐడీఏ తెలంగాణా చాప్టర్‌ ఇప్పుడు డైటెటిక్స్‌ డే 2022ను నిర్వహించింది. ఎస్పెరర్‌ న్యూట్రి షన్‌ యొక్క ఇమ్యునోమాడ్యులేటరీ థెరపాటిక్‌ న్యూట్రిషన్‌ సప్లిమెంట్‌ పోర్ట్‌ఫోలియో టీమ్‌ ఎనోర్మా ఈ కార్యక్రమానికి ఆతిథ్యమందించింది’’ అని అన్నారు.

 
ఎస్పెరర్‌ న్యూట్రిషన్‌ యొక్క ఇమ్యునోమాడ్యులేటరీ పోర్ట్‌ఫోలియో, ఎనోర్మా పలు దీర్ఘకాలిక వ్యాధుల సమస్యలను తీర్చడంలో సహాయపడటంతో పాటుగా ఇండియా, యుకె లాంటి దేశాలలో ఇప్పటికే తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకుంది. ఈ వేడుకలలో న్యూట్రిషన్‌, డైటెటిక్స్‌ సమాజం నుంచి పలువురు సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మిస్‌ న్యూట్రిషియనిస్ట్‌ పోటీలు జరిగాయి. అనంతరం న్యూట్రిషియనిస్టులు మరియు డైటీషియన్స్‌కు సాధన అవార్డులను అందజేశారు.