గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 15 సెప్టెంబరు 2021 (23:47 IST)

క్యాన్సర్‌ న్యూట్రిషన్‌ పరిశోధనా కేంద్రంతో ఆంకాలజీ న్యూట్రిషన్‌లో పెను మార్పుల కోసం ప్రణాళిక చేసిన ఎస్పెరర్‌

పరిశోధనాధారిత అంతర్జాతీయ క్లీనికల్‌ న్యూట్రిషన్‌ సంస్థ, ఎస్పెరర్‌ న్యూట్రిషన్‌ (ఈఓఎన్‌), భారతదేశపు మొట్టమొదటి క్యాన్సర్‌ రీసెర్చ్‌ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించింది. వినూత్నమైన న్యూట్రిషనల్‌ చికిత్సలను వినియోగించి అత్యంత క్లిష్టమైన వ్యాధుల నివారణ మరియు నిర్వహణ చేయడంలో అగ్రగామిగా ఎస్సెరర్‌ న్యూట్రిషన్‌ వెలుగొందుతుంది. హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన ఈ న్యూట్రిషన్‌ పరిశోధనా కేంద్రం నాణ్యమైన క్షేత్రస్ధాయి మరియు ల్యాబ్‌ అధ్యయనాలను అందించడంతో పాటుగా వినియోగదారులకు మెరుగైన ఫలితాలను అందించనుంది.
 
భారతదేశంలో, క్యాన్సర్‌ సహా సంక్రమణేతర వ్యాధులు వేగంగా వృద్ధి చెందుతున్నాయి. ఇవి ప్రధానంగా మనం అనుసరిస్తున్న జీవనశైలి సంబంధితం కావడంతో పాటుగా ఒకరు పొందే చికిత్సతో ఆ వ్యాధిలను నియంత్రించుకోవడం సాధ్యమవుతుంది.  ఈ తరహా వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే సమగ్రమైన పౌష్టికాహారం అవసరం ఉంది. ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవడమనేది ఆరోగ్యవంతమైన, చురుకైన శరీరం నిర్మించుకోవడంలోనూ సహాయపడుతుంది. ఈ కారణం చేత ప్రతి ఒక్కరికీ సరైన డైట్‌ తీసుకోవాల్సిన అవసరం ఉంది.
 
ఇటీవలి కాలంలో  విడుదలైన అంతర్జాతీయ న్యూట్రిషన్‌ నివేదికల ప్రకారం, పౌష్టికాహార లోపం కలిగిన దేశాల సరసన ఇండియా నిలిచింది. అదే సమయంలో అత్యధిక క్యాన్సర్‌ ప్రాబల్యమూ ఇక్కడ కనబడుతుంది, ఎస్పెరర్‌ న్యూట్రిషన్‌ తమ వినూత్నమైన క్యాన్సర్‌ పరిశోధనా కేంద్రం ద్వారా ఈ పెరుగుతున్న ఆందోళనలను గణనీయంగా తగ్గించాలని కోరుకుంటుంది.  సమగ్రమైన పరిష్కారాలను కనుగొనడంలో భాగంగా విస్తృత శ్రేణి  క్షేత్ర స్థాయి మరియు ల్యాబ్‌ అధ్యయయనాల ద్వారా  క్యాన్సర్‌ రోగుల జీవిత నాణ్యతను మెరుగుపరచాలని లక్ష్యంగా చేసుకుంది.
 
ఈ నూతన ప్రయాణం గురించి శ్రీ రకీం చటోపాధ్యాయ్‌ ఫౌండర్‌ అండ్‌ సీఈవో, ఎస్పెరర్‌ న్యూట్రిషన్‌ మాట్లాడుతూ, ‘‘భారతదేశంలో క్యాన్సర్‌ కారణంగా ఎదురవుతున్న మరణాలు పాశ్చాత్య దేశాలతో పోలిస్తే చాలా అధికంగా ఉంటున్నాయి (68% వర్సెస్‌ 37%). వైవిధ్యమైన జీవనశైలి మరియు ఆహార సంస్కృతి వంటివి క్యాన్సర్‌ మరణాలు మరియు కారణాలలో  అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. క్యాన్సర్‌ నమోదిత డాటా ఆధారంగా, ప్రతి సంవత్సరం భారతదేశంలో 8 లక్షల నూతన కేసులు నమోదవుతున్నాయి. ఇది చాలా పెద్ద సంఖ్య.
 
ఎస్పెరర్‌ క్యాన్సర్‌ న్యూట్రిషన్‌ పరిశోధనా కేంద్రంతో, మేము అత్యంత తీవ్రమైన క్షేత్ర మరియు ల్యాబ్‌ స్ధాయి పరిశోధనలు చేయడంతో పాటుగా ఆంకాలజీ న్యూట్రిషన్‌కు సంబంధించి ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు తగిన చేయూతనందిస్తూనే పలు సామాజిక-ఆర్థిక ఆందోళనలను ఏకీకృతం చేసే బాధ్యతనూ తీసుకోబోతున్నాం. తద్వారా క్యాన్సర్‌ రోగుల జీవిత నాణ్యతను గణనీయంగా మెరుగుపరచడంతో పాటుగా పలు క్యాన్సర్‌ నివారణ సైకలాజికల్‌ పరిస్థితులు (ఎన్‌సీడీలు) మెరుగుపరచనున్నాం’’ అని అన్నారు.