మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (22:57 IST)

జిఎస్‌టి కింద పెట్రోల్, డీజిల్: రిపోర్ట్

దేశవ్యాప్తంగా ఒకే వస్తు, సేవల పన్ను(సింగిల్ జిఎస్‌టి) కింద పెట్రోల్, డీజిల్ పన్ను తెచ్చే విషయాన్ని జిఎస్‌టి కౌన్సిల్ శుక్రవారం పరిశీలించనుంది. ఇందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఉత్పత్తుల పన్ను విధానంలో చాలా వరకు రాజీపడాల్సి ఉంటుంది. 
 
రికార్డు స్థాయిలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల సమస్యకు పరిష్కారం జిఎస్‌టియేనన్న భావన ఉంది. పన్నుపై పన్ను ప్రభావాన్ని ఇది అంతమొందించగలదని భావిస్తున్నారు. అలాగే విలువ ఆధారిత పన్ను (వ్యాట్) అనేది ఉత్పత్తి ఖర్చుపైనే కాకుండా, ఉత్పత్తిపై కేంద్రం విధించే ఎక్సైజ్ పన్నుపై కూడా పడుతుంటుంది
 
ఈ నేపథ్యంలో లక్నోలో శుక్రవారం జిఎస్‌టి కౌన్సిల్ సమావేశం జరుగనుంది. జిఎస్‌టి కౌన్సిల్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రులు ఉంటారు. ఈ సమావేశంలో అత్యవసర సరకులకు కోవిడ్-19 పన్ను మినహాయింపును కూడా విస్తరించే అవకాశాన్ని పరిశీలించనున్నారు.