గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 13 సెప్టెంబరు 2021 (13:33 IST)

పెట్రోల్ బంకుల్లో భారీ మోసం : లీటరు కొట్టిస్తే పావులీటర్ ఖతం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల్లో సిబ్బంది భారీ మోసానికి పాల్పడున్నారు. లీటరు పెట్రోల్ కొట్టిస్తే పావు లీటరు కాజేస్తున్నారు. పెట్రోల్ బంకు యజమానులతో పాటు.. సిబ్బంది కూడా తమ చేతివాటాన్ని బాగానే ప్రదర్శిస్తున్నారు. దీంతో పెట్రోల్ వినియోగదారులు తీవ్రంగా మోసపోతున్నారు. 
 
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తూనికలు కొలతలశాఖ చేపట్టిన తనిఖీల్లో మరోసారి మైక్రో మాయ బయటపడింది. ఒకటి రెండు కాదు దాదాపు 600 బంకుల్లో తనికీలు చేయగా అందులో 17 బంకుల్లో ఇలాగే మోసం చేస్తున్నట్లు తేలింది. వీరు రోజూ రూ.లక్షలలో మోసం చేస్తున్నారు. డిస్‌ప్లే మిషన్‌కు లోపల 2 చిప్‌లు అమర్చి, కరెక్ట్ మీటర్ చూపించే విధంగా భారీ మోసం చేస్తున్నారు. దీంతో విజయవాడ గుణదలలో ఓ పెట్రోల్ బంకును సీజ్ చేసి… యజమానిపై కేసు నమోదు చేశారు. 
 
ఈ తరహా మోసాలు ఎక్కువగా గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో జరుగుతున్నట్టు గుర్తించారు. హైదరాబాద్‌లో పెట్రోల్‌ బంకుల్లో ప్రత్యేక చిప్‌లు అమర్చి పెట్రోల్‌ కొలతల్లో మోసాలకు పాల్పడుతున్న ముఠా దందాను పోలీసులు పట్టుకోవడం గతంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.