1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. AP Corona cases update

ఏపీలో కొత్తగా 2526 మందికి కరోనా పాజిటివ్

Andra Pradesh
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మరో 2526 మందికి కరోనా వైరస్ సోకింది. గడచిన 24 గంటల్లో ఈ కేసులు బయటపడ్డాయని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన మీడియా బులిటెన్‌లో తెలిపింది. 
 
ఈ కేసులో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 404 కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 391, ప్రకాశం జిల్లాలో 308 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 35 కేసులు గుర్తించారు.
 
మరోవైపు, 2,933 మంది కరోనా నుంచి కోలుకోగా, 22 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 19,32,105 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 18,93,498 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 25,526 మంది చికిత్స పొందుతున్నారు. అటు, కరోనా మృతుల సంఖ్య 13,081కి పెరిగింది.
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
ఆస్తి ప‌న్ను పెంపుపై నిర‌స‌న‌... విజ‌య‌వాడ‌లో ఉద్రిక్త‌త‌