మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 9 జులై 2021 (10:55 IST)

దేశంలో మరో 43,393 కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో గడచిన 24 గంటల్లో మరో 44549 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం బులిటెన్‌ను రిలీజ్ చేసింది. అలాగే, 24 గంట‌ల్లో 44,459 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,07,52,950కు చేరింది.
 
మరణాల విషయానికొస్తే, నిన్న‌ 911 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,05,939కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,98,88,284 మంది కోలుకున్నారు. 
 
ప్రస్తుతం 4,58,727 మందికి ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. మొత్తం 36,89,91,222 వ్యాక్సిన్ డోసులు వేశారు. నిన్న‌ 40,23,173 డోసులు వేశారు. 
 
అలాగే, తెలంగాణలో గురువారం రోజున 1,02,761 కరోనా పరీక్షలు నిర్వహించగా, 731 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 80 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా నారాయణ్ పేట్ జిల్లాలో రెండు కేసులు వెల్లడయ్యాయి. 
 
ఖమ్మం జిల్లాలో 64, నల్గొండ జిల్లాలో 56 కేసులు గుర్తించారు. అదే సమయంలో 993 మంది కరోనా నుంచి కోలుకోగా, నలుగురు మరణించారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో 3,714 మంది కరోనాతో మృతి చెందారు.
 
ఇప్పటివరకు రాష్ట్రంలో 6,29,785 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,14,865 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 11,206 మంది చికిత్స పొందుతున్నారు.