మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 7 జులై 2021 (12:37 IST)

ధోనీ బర్త్ డే స్పెషల్.. రికార్డుల ఘనుడు మహీ గొప్పతనం..

Dhoni
టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీ.. జులై 7న 39వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఇప్పటికే సోషల్ మీడియాలో అభిమానులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా ధోనీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో మహీ పేరు ఇప్పటినుండే మార్మోగిపోతోంది.
 
ఎంఎస్ ధోనీ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి 'కామన్ డీపీ' ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరోవైపు పీఎల్ ప్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి పాటను అంకితమిచ్చేందుకు ఆ జట్టు ఆటగాడు, వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో సిద్ధమయ్యాడు. ధోనీ ఘనతలు, గొప్పతనాన్ని కీర్తిస్తూ 'ఎంఎస్ ధోనీ సాంగ్‌ నం7​' పేరిట బ్రావో ఈ పాటను రూపొందించాడు. ధోనీ పుట్టినరోజును పురస్కరించుకొని జులై 7న పాటను విడుదల కానుంది. 
 
ఇకపోతే.. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత ఎంఎస్ ధోనీ టీమిండియాకి దూరమయ్యాడు. బీసీసీఐ సెలక్షన్‌కు కూడా అందుబాటులో ఉండడం లేదు. దీంతో సెంట్రల్ కాంట్రాక్టు నుండి అతనిని బీసీసీఐ తప్పించింది. ఇక మహీ స్థానంలో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్‌కి భారత సెలక్టర్లు వరుసగా అవకాశాలిచ్చారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఐపీఎల్ 2020 నిరవధిక వాయిదా పడింది. దీంతో ధోనీ ప్రొఫెషనల్ క్రికెట్‌లోకి తిరిగి రావడాన్ని ఆలస్యం చేసింది. 
Dhoni
 
ఐపీఎల్‌లో మహీ బాగా రాణించినట్లయితే.. అక్టోబర్-నవంబర్‌లో జరిగే టీ20 ప్రపంచకప్ ఆడే అవకాశం ఉండేది. కానీ పరిస్థితి ఇప్పుడు అలా లేదు. లీగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో కచ్చితంగా చెప్పలేం. దీంతో ధోనీ అంతర్జాతీయ క్రికెట్ భవిష్యత్తు డైలమాలో పడింది.
 
ఎంఎస్ ధోనీ బంగ్లాదేశ్‌తో 2004లో జరిగిన వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. మహ్మద్ కైఫ్ కారణంగానే ఆ మ్యాచ్‌లో రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విఫలమయ్యాడు. దీంతో ధోనీ కెరీర్ ముగిసినట్లేనని అందరూ భావించారు. కానీ విశాఖ తీరాన విధ్వంసంతో (123 బంతుల్లో 15 ఫోర్లు 4 సిక్స్‌లతో 148 రన్స్) ధోనీ మైదానంలో తిరుగులేని శక్తిగా ఎదిగాడు.
 
ప్రపంచంలోనే అత్యుత్తమ సారథిగా నిలిచాడు. 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీలో కెప్టెన్‌గా భారత్‌ని విజేతగా నిలిపిన ధోనీ.. క్రికెట్ చరిత్రలో ఓ మూడు ఐసీసీ టోర్నీలు గెలిచిన ఏకైక కెప్టెన్‌గా రికార్డుల్లో కొనసాగుతున్నాడు.
 
ధోనీ గురించి.. 
ధోని 1981 జూలై 7న జన్మించాడు. భారతీయ క్రికెటర్‌లో ఒక మంచి ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఎన్నో మ్యాచ్‌లలో ఆడి, తనదైన శైలిలో మ్యాచ్ ని గెలిపించాడు మాజీ క్యాప్టెన్ మహేంద్ర ధోని. డిసెంబర్ 2004 న బంగ్లాదేశ్‌తో తొలి వన్డే మ్యాచ్ ఆడాడు ధోని. శ్రీలంకతో ఒక సంవత్సరం తర్వాత 2005 లో తన తొలి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ధోని టెస్టులు, ఇంటర్నేషనల్ మ్యాచ్ లలో, అత్యధిక మ్యాచ్లు గెలిచి కెప్టెన్సీ రికార్డులు సృష్టించాడు.
 
2007లో రాహుల్ ద్రావిడ్ నుంచి వన్డే కెప్టెన్సీ తీసుకున్న ధోని తన మొదటి కెప్టెన్సీతోనే శ్రీలంక, న్యూజిలాండ్‌తో పోరాడి విజయాన్ని తీసుకువచ్చారు. అంతేకాకుండా ఐసీసీ వరల్డ్ కప్, 20-20 వరల్డ్ కప్, 2010లో ఆసియా కప్, 2011 ఐసీసీ వరల్డ్ కప్, 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుపొందాడు.2011 వరల్డ్ కప్ ఫైనల్‌లో ధోని 96 పరుగులు చేసి, నాటౌట్‌గా నిలిచాడు. ఇక మరెన్నో ట్రోఫీలు గెలిచారు.
 
తన చిన్ననాటి స్నేహితురాలు అయిన"సాక్షి"ని జూలై 4-2010లో వివాహం చేసుకున్నాడు. వీరికి జీవ అనే ఒక కూతురు. లెఫ్టినెంట్ కల్నల్ అనే బిరుదును కూడా ధోని సంపాదించాడు. ధోనీ హెలికాప్టర్ షాట్..తన చిన్ననాటి స్నేహితుడు అయిన  "సంతోష్ లాల్" ధోనికి నేర్పించాడు.