మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 11 జులై 2021 (10:55 IST)

దేశంలో ఈ రోజు కరోనా అప్‌డేట్స్...

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 41,506 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. అలాగే, 24 గంట‌ల్లో 41,526 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,07,95,716కు చేరింది.
 
ఇక మరణాల విషయానికొస్తే, గడిచిన 24 గంటల్లో 895 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,08,040కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,99,75,064 మంది కోలుకున్నారు. 4,54,118 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశంలో 37,60,32,586 వ్యాక్సిన్ డోసులు వేశారు. 
 
ఇదిలావుంటే, నిన్నటి వరకు మొత్తం 43,08,85,470 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. ఒక్క ఆదివారమే 18,43,500 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.