శనివారం, 16 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 4 జులై 2021 (19:05 IST)

తూగోలో 662 పాజిటివ్ కేసులు.. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని?

ఏపీలో గడచిన 24 గంటల్లో 94,595 కరోనా పరీక్షలు నిర్వహించగా 3,175 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 662 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 59 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 3,692 మంది కరోనా నుంచి కోలుకోగా, 29 మంది మరణించారు. అత్యధికంగా చిత్తూరులో ఆరుగురు, కృష్ణా జిల్లాలో ఐదుగురు మరణించారు.
 
రాష్ట్రంలో ఇప్పటివరకు 19,02,923 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 18,54,754 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 35,325 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం మరణాల సంఖ్య 12,844కి పెరిగింది.
 
దేశంలో నిన్న  43,071  క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. అలాగే, 24 గంట‌ల్లో 52,299 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,05,45,433కు చేరింది.
 
ఇక మరణాల విషయానికొస్తే, నిన్న‌ 955 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం  4,02,005కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,96,58,078 మంది కోలుకున్నారు. 4,85,350 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. మొత్తం 35,12,21,306 వ్యాక్సిన్ డోసులు వేశారు.