దేశంలో మరో 42 వేల కరోనా పాజిటివ్ కేసులు
దేశంలో మరో 45 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించిన వివరాల మేరకు... గత 24 గంటల్లో 42,766 కరోనా కేసులు నమోదయ్యాయని పేర్కొంది.
24 గంటల్లో 45,254 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,07,95,716కు చేరింది. మరణాల విషయానికొస్తే, గడిచిన 24 గంటల్లో 1,206 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.
దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,07,145కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,99,33,538 మంది కోలుకున్నారు. 4,55,033 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 729 పాజిటివ్ కేసులు నమోదు కాగా… మరో ఆరుగురు కోవిడ్ బాధితులు మృతిచెందారు… ఇక, ఇదే సమయంలో 987 కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.
దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,30,514కు చేరుకోగా ఇప్పటివరకు కోలుకున్న కోవిడ్ బాధితుల సంఖ్య 6,15,852కు పెరిగాయి. మృతుల సంఖ్య 987కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 10,942 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,06,045 సాంపిల్స్ పరీక్షించినట్టు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.