శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By జెఎస్కె
Last Modified: గురువారం, 15 జులై 2021 (17:55 IST)

అమెరికా టూర్ ఫండ్ ఏమైంది? 'మా' బిల్డింగ్ ఎందుకు కట్టలేకపోతున్నారు? బాల‌య్య ఫైర్

మా బిల్డింగ్ ఎందుకు కట్ట‌లేక‌పోతున్నారు... అమెరికా వెళ్ళొచ్చిన డ‌బ్బు ఏమైంది? గ్లామ‌ర్ ఇండ‌స్ట్రీలో ఉన్నాం... అన్నీ ఓపెన్‌గా మాట్లాడ‌లేం క‌దా అంటూ ఎమ్మెల్యే బాల‌య్య బాబు ఫైర్ అయ్యారు. 
 
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలపై సీనియర్‌ హీరో నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు ‘మా’ బిల్డింగ్‌ ఎందుకు కట్టలేకపోతున్నారని కమిటీ సభ్యులను నిలదీశారు. తెలంగాణ ప్రభుత్వంతో రాసుకుని పూసుకుని తిరుగుతున్నారు.

మా భవనం కోసం అడిగితే ఒక ఎకరం ఇవ్వదా? అని ఆయన ప్రశ్నించారు. గ్లామర్ ఇండస్ట్రీలో ఉన్న మనమంతా.. బహిరంగంగా చర్చించుకోవడం సరికాదన్నారు. అసోసియేషన్ ఎన్నికల్లో అర్టిస్టులు అందరూ సమానమేనన్నారు.
 
గతంలో ఫండ్ రైజింగ్ పేరుతో, మా సభ్యులు అమెరికా వెళ్లిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఫస్ట్ క్లాస్, టాప్ క్లాస్‌లో ఫ్లైట్‌లో అమెరికా వెళ్లి చేసిన కార్యక్రమాల ద్వారా వచ్చిన డబ్బులు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. ‘మా’ బిల్డింగ్‌ నిర్మాణం కోసం మంచు విష్ణు ముందుకొస్తే, తాను సహకరిస్తానని చెప్పారు. సినీ పెద్దలంతా కలిసి వస్తే.. ఇంద్రభవనం నిర్మించుకోవచ్చని బాలయ్య అన్నారు.