శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 15 సెప్టెంబరు 2021 (23:39 IST)

అత్యవసర పరిస్థితులలో సన్నద్ధత కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్‌తో కలిసి శిక్షణ, మాక్‌డ్రిల్‌ నిర్వహించిన స్మార్ట్‌కెమ్‌ టెక్నాలజీస్‌

భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన రసాయనాలు మరియు ఎరువుల తయారీ సంస్ధ దీపక్‌ ఫెర్టిలైజర్స్‌ అండ్‌ పెట్రోకెమికల్స్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌ (డీఎఫ్‌పీసీఎల్‌)కు అనుబంధ సంస్ధ అయిన స్మార్ట్‌కెమ్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ (ఎస్‌టీఎల్‌) తమ ఉద్యోగుల కోసం పొన్డా వద్ద ఉన్న తమ ప్రాంగణంలో శిక్షణా కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) భాగస్వామ్యంతో  నిర్వహించారు.
 
ఉద్యోగుల ఆరోగ్యం, భద్రత కు కట్టుబడిన ఎస్‌టీఎల్‌, స్థానిక సమాజ సంక్షేమానికీ కట్టుబడి ఉంది. ఈ శిక్షణ ప్రధానోద్దేశ్యం అవాంఛిత సంఘటనలు అయిన  రసాయన అగ్ని ప్రమాదం/ ప్రమాదాలు జరిగినప్పుడు ఉద్యోగులు ఏవిధంగా వ్యవహరించాలి, అత్యవసర సమయాలలో  రెస్క్యూ కార్యక్రమాలు ఏ విధంగా చేయాలో  తెలుపడం. ఈ శిక్షణను నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ (ఎన్‌డీఆర్‌ఎఫ్‌),10వ బెటాలియన్‌, విశాఖపట్నం వారి సహాయంతో నిర్వహించారు.
 
ఈ సవివరమైన శిక్షణను  శ్రీ సుశాంత కుమార్‌ బెహరా నేతృత్వంలోని  ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం నిర్వహించింది. ఒకవేళ రసాయనాలు లీక్‌ కావడం లేదా ప్రమాదం జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వీరు వెల్లడించారు. ఈ శిక్షణ కోసం ఎంపికైన ఉద్యోగులకు విభిన్నమైన రెస్క్యూ ఆపరేషన్స్‌ పట్ల సవివరమైన శిక్షణను అందించారు. విభిన్నమైన పరిశ్రమలలో చేపట్టాల్సిన రెస్క్యూ కార్యకలాపాలను గురించి తెలుపుతూనే ప్రాధమిక చికిత్స పద్ధతులను గురించి కూడా వెల్లడించారు. మధ్యాహ్న అనంతరం ఓ మాక్‌ డ్రిల్‌ను డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌, శ్రీకాకుళం నిర్వహించారు. ఓ ట్యాంక్‌ నుంచి అమ్మోనియా లీక్‌ అయితే ఏం చేయాలనేది ఉద్యోగులకు ఆయన వివరించడంతో పాటుగా ఈ డ్రిల్‌ ద్వారా ఉద్యోగులకు తగిన అవగాహనను కల్పించారు.
 
ఈ కార్యక్రమం గురించి శ్రీకాకుళం యూనిట్‌ హెడ్‌ శ్రీ పీసీఎస్‌ రావు మాట్లాడుతూ ‘‘ విశాఖపట్నంలోని ఎన్‌డీఆర్‌ఎఫ్‌ 10వ బెటాలియన్‌  మొత్తానికీ ధన్యవాదములు తెలుపుతున్నాము. మా ఉద్యోగుల కోసం వారు అధిక సమయం కేటాయించడంతో  పాటుగా అత్యంత విలువైన, ప్రాణాలను కాపాడే పాఠాలను బోధించారు. గతంలో మేము చేపట్టిన ఆరోగ్య, భద్రతా ప్రమాణాలు, ప్రక్రియలకు ఎన్నో ప్రశంసలను అందుకున్నాము.
 
మా ఆరోగ్య, భద్రతా రికార్డుల పరంగా మరియు విషపూరితమైన, మండే స్వభావం కలిగిన రసాయనాలను నిర్వహించడంలో మా రికార్డు పట్ల  మేము గర్వకారణంగా ఉన్నాము. అయితే, మేము ఎప్పుడూ కూడా మమ్మల్ని మేము మెరుగుపరుచుకోవడంతో పాటుగా మా ఉద్యోగులు సురక్షితంగా మరియు ఆరోగ్యంగా ఉండటంలో భరోసా అందిస్తున్నాం. మేము చేపట్టిన కార్యక్రమాలు మా ఉద్యోగులకు సురక్షితంగా ఉన్నామనే భరోసా కలిగిస్తాయి’’ అని అన్నారు.
 
డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ శ్రీ జీవీఎస్‌ నారాయణ మరియు ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ శ్రీ పి చిన్నారావు సైతం ఈ మాక్‌డ్రిల్‌లో పాల్గొనడంతో పాటుగా ఆలోచనాత్మక కార్యక్రమం నిర్వహించిన స్మార్ట్‌కెమ్‌ టెక్నాలజీస్‌ను అభినందించారు. ఈ కార్యక్రమాలలో పాల్గొన్న ఉద్యోగులకు సర్టిఫికెట్లను సైతం వారు అందజేశారు.