సంబంధిత వార్తలు
- బెజవాడకు పాకిన హిజాబ్ వివాదం - లయోలా కాలేజీలో...
- హిజాబ్ వివాదం : నేటి నుంచి కర్నాటకలో స్కూల్స్
- హిజాబ్ వివాదం : కర్నాటక తీర్పు వచ్చేంత వరకు వెయిట్ చేస్తాం : సుప్రీంకోర్టు
- హిజాబ్ వివాదం.. కంగనా స్పందన.. మీకు ధైర్యం చూపించాలని ఉంటే?
- హిజాబ్ సెగలు : డ్రెస్ కోడ్‌పై ఎవరినీ బలవంతం చేయొద్దు... కర్నాటక హైకోర్టు
అన్ని మతాల వారు స్కూల్ యూనిఫాం ధరించాలి : అమిత్ షా
దేశంలోని అన్ని మతాలకు చెందిన పిల్లలు ఖచ్చితంగా స్కూల్ యూనిఫాం ధరించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. అయితే, హిజాబ్ వివాదంలో కోర్టు తీర్పును గౌరవిస్తామని ఆయన చెప్పారు.
ఇటీవల కర్నాకట రాష్ట్రంలోని ఓ పాఠశాలలో హిజాబ్ వివాదం చెలరేగింది. ప్రస్తుతం ఈ వివాదం కోర్టు పరిధిలో ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ఈ వివాదంపై స్పందించారు. పాఠశాలలకు వచ్చే విద్యార్థులు మతపరమైన దుస్తులు ధరించడం అంటే యూనిఫామం ధరించి స్కూలుకు రావడానికే తాను మద్దతు పలుకుతానని చెప్పారు.
దేశంలోని అన్ని మతాల వారు స్కూలు యూనిఫాంలను అంగీకరించాలని ఆయన ఉద్ఘాటించారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. అయితే, హిజాబ్ వివాదంలో కర్నాటక హైకోర్టు తీర్పును వెలువరించిన తర్వాత తన అభిప్రాయం మారొచ్చని తెలిపారు. కోర్టు ఇచ్చే తీర్పు ఎలా ఉన్నప్పటికీ దాన్ని తాను గౌరవిస్తానని చెప్పారు.
అదేసమయంలో దేశ ప్రజలంతా రాజ్యాంగ ప్రకారం నడుచుకోవాలో... ఇష్టానుసారంగా నడుచుకోవాలో తేల్చుకోవాల్సి ఉందని అమిత్ షా అన్నారు. హిజాబ్ వివాదంలో కర్నాటక హైకోర్టు ఇచ్చే తీర్పును ప్రతి ఒక్కరూ పాటించాలని ఆయన కోరారు.
