సంబంధిత వార్తలు
- గ్వాలియర్లో ఘోర రోడ్డు ప్రమాదం... నెల్లూరులో ఆటోను ఢీకొన్న పాల వ్యాను
- తెలుగు రాష్ట్రాల్లో దూసుకొచ్చిన మృత్యువు .. చెరువుల్లో చేపలు పట్టడానికి వెళ్తూ...
- నెల్లూరు జాతీయ రహదారిపై రివ్వుమంటూ స్విఫ్ట్ కారు, ఆపి చెక్ చేస్తే రూ. 1 కోటి
- ప్రేమ పెళ్లి.. పరువు కోసం వధువు నోట్లో పురుగుల మందు పోసి...
- ఓ చేతిలో స్టీరింగ్.. మరో చేతిలో బీరు బాటిల్ ... గాల్లో కలిసిన నలుగురి ప్రాణాలు
నెల్లూరు దామరమడుగు వద్ద ఘోర ప్రమాదం : 8 మంది దుర్మరణం
నెల్లూరు జిల్లా దామరమడుగులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆథ్యాత్మిక పర్యటన ముగించుకుని వెళుతోన్న భక్త బృందం అనూహ్య రీతిలో అనంతలోకాలకు వెళ్లిపోయారు. ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృత్యువతాపడ్డారు.
బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు జాతీయరహరదారిపై ఆగివున్న ఓ లారీని టెంపో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. టెంపోలో ఉన్న ఇద్దరు చిన్నారులు సురక్షితంగా బయటపడ్డారు.
మరో నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో ఐదుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతులను తమిళనాడు వాసులుగా పోలీసులు గుర్తించారు.
శ్రీశైలం యాత్ర ముగించుకుని నెల్లూరు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో టెంపోలో మొత్తం 15 మంది ప్రయాణం చేస్తున్నట్లు తెలుస్తోంది.
