సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 2 మార్చి 2021 (09:01 IST)

ఓ చేతిలో స్టీరింగ్.. మరో చేతిలో బీరు బాటిల్ ... గాల్లో కలిసిన నలుగురి ప్రాణాలు

అనంతపురం జిల్లాలో అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తు నలుగురి ప్రాణాలు తీసింది. ఒక చేత్తో స్టీరింగ్ పట్టుకుని, మరో చేత్తో బీరు బాటిల్‌తో డ్రైవింగ్ చేయడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదం జిల్లాలోని పెనుకొండ మండలం ఎర్రమంచి సమీపంలో గత అర్థరాత్రి జరిగింది. 
 
బెంగళూరువైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు కియా కంపెనీ ప్రధాన గేట్ వద్ద ముందు వెళ్తున్న వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న వారిలో ఇద్దరు యువకులు, ఇద్దరు యువతులు దుర్మరణం పాలయ్యారు. 
 
మృతులను బెంగళూరుకు చెందిన మనోజ్ మిట్టల్, ఢిల్లీకి చెందిన మరో యువకుడిగా గుర్తించారు. యువతులను గుర్తించాల్సి ఉంది. కారు డ్రైవర్ బీరు తాగుతూ డ్రైవ్ చేస్తుండటమే ప్రమాదానికి కారణమని పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.