1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Sabbam Hari health deteriorates

సబ్బం హరి ఆరోగ్య పరిస్థితి విషమం

Sabbam Hari
ఇటీవల కరోనా వైరస్‌ బారిన పడిన మాజీ ఎంపీ, తెలుగుదేశం పార్టీ నేత సబ్బం హరి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దీంతో విశాఖపట్నం కలెక్టరేట్‌ జంక్షన్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఐసీయూలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. 
 
ఈ నెల 15న ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. మూడు రోజులపాటు హోం ఐసొలేషన్‌లోనే చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత వైద్యుల సూచన మేరకు ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం పట్ల కుటుంబ సభ్యులు ఆందోళనగా ఉన్నారు. 
 
ఈ నేపథ్యంలో, సబ్బం హరి ఆరోగ్యం ప్రస్తుతం విషమంగా మారిందని డాక్టర్లు వెల్లడించారు. గత మూడ్రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన వెంటిలేటర్‌పై ఉన్నారు. ఆయనకు ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయినట్టు తెలుస్తోంది. సబ్బం హరి ఆరోగ్య పరిస్థితిపై అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
 
కాగా.. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్‌లో ఉన్నారు. 
తర్వాతి కథనం
భర్తపై పగబట్టిన భార్య... నమ్మించి ఉరిబిగించింది..