సజ్జల భార్గవ్ రెడ్డిని అరెస్ట్ చేయాలి: వైఎస్ షర్మిల
YS Sharmila
సోషల్ మీడియా పోస్టులు ఎంపీ అవినాశ్ రెడ్డి ఆదేశాల మేరకు జరిగిందని పోలీసులు చెబుతున్నారు. అవినాశ్ రెడ్డిని పోలీసులు ఎందుకు విచారించలేదు?' అని ప్రశ్నించారు. కడప స్టీల్ ప్లాంట్ కోసం కడప కలెక్టర్ కార్యాలయం ఎదుట షర్మిల నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా ఆమె వినూత్మ నిరసన చేపట్టారు. కడప స్టీల్ ప్లాంట్ అంటే కొబ్బరికాయలు కొట్టే ప్రాజెక్టు అంటూ కొబ్బరికాయలతో కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగారు.
కడప స్టీల్ ప్లాంట్‌పై పాలకులకు ఎందుకంత చిన్నచూపే అర్థం కావడం లేదు. వివేకా హత్య కేసులో వేగం పెరగడం శుభపరిణామం. ఇప్పటికైనా సునీత, సౌభాగ్యమ్మకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నా. బాధితురాలైన సునీతకు తానెప్పుడూ అండగానే ఉంటానని షర్మిల చెప్పారు.
YS Sharmila: అసభ్య పోస్టుల వెనక.. ఎంత పెద్ద తలకాయలు ఉన్నా వదిలిపెట్టొద్దు: వైఎస్ షర్మిల#apnews #yssharmila pic.twitter.com/PEc9mpkIyS
— Eenadu (@eenadulivenews) November 20, 2024
