గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 నవంబరు 2024 (13:01 IST)

ప్రెజర్ వున్నా భారీగా వర్కౌట్లు.. గుండెపోటుతో జిమ్ మాస్టర్ మృతి (video)

gym trainer
gym trainer
జిమ్ మాస్టర్ తమిళనాడు సేలంలో ప్రాణాలు కోల్పోయాడు. అపరితమైన వర్కౌట్స్ కారణంగా అతడు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం జిమ్ మాస్టర్ చివరి వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆదివారం భారీగా వర్కౌట్లు చేసిన జిమ్ మాస్టర్ మహాధీర్ మహ్మద్.. బాత్రూమ్‌లో ప్రాణాలు కోల్పోయాడు.
 
ఆదివారం రాత్రి చాలాసేపటికైనా జిమ్ నుంచి ఇంటికి రాకపోవడంపై కుటుంబీకులు జిమ్‌కు వచ్చి చూశారు. అక్కడ రెస్ట్ రూమ్‌లో విగత జీవిగా పడివున్న మహాధీర్‌ను చూసి షాకయ్యారు. వెంటనే వారు ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతనిని పరిశోధించిన వైద్యులు అప్పటికే మహ్మద్ గుండెపోటుతో మరణించినట్లు ధ్రువీకరించారు. 
 
గుండెపోటుతో జిమ్ మాస్టర్ ప్రాణాలు కోల్పోవడంతో కేసు నమోదు కాలేదు. ఇక మహాధీర్ మాజీ డీఎంకే నేత కుమారుడని తెలిసింది. మహ్మద్‌కు ప్రెజర్ వుండేదని.. అధికంగా వర్కౌట్స్ చేయొద్దని చెప్పినా పట్టించుకోకుండా ఆ పని చేసేవాడని.. ఎవ్వరికీ భయపడే వాడు కాదని.. ఏదైనా సాధించాలనే తపన అతనిలో వుండేదని మహ్మద్ తల్లి రోదిస్తూ చెప్పుకొచ్చింది. మహ్మద్ వర్కౌట్స్‌‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.