శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By srinivas
Last Modified: శుక్రవారం, 13 జులై 2018 (21:28 IST)

నాన్నా... అమ్మ పిచ్చిది... విజయవాడ రోడ్లు కూడా తెలియవు... సూసైడ్ లేఖలో విద్యార్థి

ఇంటర్‌ విద్యార్థి నితిన్ రాసిన సూసైట్ నోట్ చదివిన వారిని కన్నీరు పెట్టించింది. విజయవాడ గురునానక్‌ కాలనీలో నితిన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నితిన్‌ కుమార్‌ శ్రీచైతన్య కాలేజీలో జూనియర్‌ ఇంటర్‌ చదువుతున్నాడు. అతను కాలేజీలో ఉరి వేసుకుని తనువు చాలించాడు. ని

ఇంటర్‌ విద్యార్థి నితిన్ రాసిన సూసైట్ నోట్ చదివిన వారిని కన్నీరు పెట్టించింది. విజయవాడ గురునానక్‌ కాలనీలో నితిన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నితిన్‌ కుమార్‌ శ్రీచైతన్య కాలేజీలో జూనియర్‌ ఇంటర్‌ చదువుతున్నాడు. అతను కాలేజీలో ఉరి వేసుకుని తనువు చాలించాడు. నితిన్‌ ఆత్మహత్యకి ముందు సూసైడ్‌ లెటర్‌ రాశాడు. 
 
‘అమ్మకి నేను తప్పితే ఎవరూ లేరు నాన్నా.. పాపం పిచ్చిది. విజయవాడ రోడ్లు కూడా తెలియవు.. అమ్మను మాత్రం జాగ్రత్తగా చూసుకో. పాపం పవిత్రకి నువ్వంటే చాలా ఇష్టం నాన్న. తనను కూడా జాగ్రత్తగా చూసుకో. అమ్మ నేను లేకపోతే బ్రతకలేదు. కాబట్టి కొంచెం ఎక్కువ కేర్ తీసుకో. అమ్మ నిన్ను ఇష్ట పడినంతగా ఎవ్వరినీ ఇష్టపడలేదు.
 
జాగ్రత్త ‘మా’. పవిత్రా... అమ్మను జాగ్రత్తగా చూసుకో.... విత్ లవ్ అంటూ రాసిన సూసైడ్ నోట్ కంటతడి పెట్టిస్తుంది. విద్యార్థి స్వస్థలం కృష్ణా జిల్లాలోని మొగల్రాజుపురం. నితిన్ ఆత్మహత్యకు ఒత్తిడి కారణమా లేక కుటుంబ కలహాలా అన్నది తెలియాల్సి ఉంది.