శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By srinivas
Last Modified: శుక్రవారం, 13 జులై 2018 (20:34 IST)

సేల్స్ రిప్రజెంటేటివ్స్ పేరిట.. విజయవాడలో మహిళపై దారుణం

విజయవాడ సత్యనారాయణ పురంలో దారుణం జరిగింది. సేల్స్ రిప్రజెంటేటివ్స్ పేరిట ఇంట్లోకి ప్రవేశించి పద్మావతి అనే మహిళను హత్య చేసేందుకు ఇద్దరు ఆగంతుకులు ప్రయత్నించారు. ఇద్దరు యువకులు పద్మావతి (48) ఇంట్లోకి దొంగతనానికి చొరబడ్డారు. అది గమనించిన ఆమె వారిద్దరిపై

విజయవాడ సత్యనారాయణ పురంలో దారుణం జరిగింది. సేల్స్ రిప్రజెంటేటివ్స్ పేరిట ఇంట్లోకి ప్రవేశించి పద్మావతి అనే మహిళను హత్య చేసేందుకు ఇద్దరు ఆగంతుకులు ప్రయత్నించారు. ఇద్దరు యువకులు పద్మావతి (48) ఇంట్లోకి దొంగతనానికి చొరబడ్డారు. అది గమనించిన ఆమె వారిద్దరిపై ఎదురు తిరిగింది. 
 
పెద్దగా అరుస్తూ కేకలు పెట్టింది. దీంతో ఆ ఆగంతుకులు మహిళ మెడ కత్తితో కోసి అక్కడి నుంచి పరారయ్యారు. పద్మావతి అరుపులు విన్న చుట్టుప్రక్కల వారు వచ్చేసరికి ఆమె రక్తపు మడుగులో పడి వుంది. దీనితో హుటాహుటిన ఆమెను ఆంధ్ర ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగులు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
 
పద్మావతి ఇంట్లో హత్యాప్రయత్నం తర్వాత దుండగులు మరో అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లారు. అక్కడ పని చేసే వాచ్‌మెన్‌ మీరు ఎవరని నిలదీయడంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.