సంబంధిత వార్తలు
- కమెడియన్ ప్రవీణ్ బకాసుర రెస్టారెంట్ నుంచి జాతీయం లిరికల్ విడుదల
- తెలుగు సినిమాటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పి.జి.విందా
- Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !
- Praveen, Viva Harsha: ఆసక్తి కలిగిస్తున్న ప్రవీణ్, వైవా హర్ష బకాసుర రెస్టారెంట్ ఫస్ట్ లుక్
- Nani: నాని తదుపరి సినిమా దర్శకుడు సుజీత్ గురించి అప్ డేట్
హీరో శ్రీకాంత్ ప్రైవేటు పూజలు- శ్రీకాళహస్తి పండితుడిపై సస్పెన్షన్ వేటు (video)
Srikanth
శ్రీకాళహస్తి ఆలయ అర్చకులు బయట ఎక్కడా కూడా ఇలాంటి పూజలు చేయకూడదు అనే నిబంధనలు ఉన్నాయి. అలా కాకుండా ప్రైవేటుగా ఇలాంటి పూజలు చేసినప్పుడు సదరు అర్చకులపై దేవాదాయ శాఖ చట్టం ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది.
శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేటుగా నవగ్రహ శాంతి పూజలు నిర్వహించిన వ్యవహారంపై శ్రీకాళహస్తి ఆలయ అర్చకుడిపై ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ ఘటన గురించి సమాచారం అందిన వెంటనే, ఆలయ అధికారులు విచారణ జరిపి, సంబంధిత వేద పండితుడిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు.
కాగా.. సినీ సెలబ్రేటీలతో పాటు ప్రముఖ క్రికెటర్లు, దిగ్గజ వ్యాపారులు శ్రీకాళహస్తిలో తరుచు శాంతి పూజలు, దోష నివారణ పూజలు జరిపిస్తుంటారు. ఇందుకోసం వారికి దేవాలయం పరిధిలోనే ఏర్పాట్లు చేస్తుంటారు. అయితే ఆలయ నిబంధనల మేరకు ప్రైవేటుగా, ఆలయం వెలుపల పూజలకు నిషిద్దం.
హీరో శ్రీకాంత్ కి ప్రైవేటు పూజలు చేసారని పండితుడిపై సస్పెన్షన్ వేటు
— ChotaNews App (@ChotaNewsApp) May 31, 2025
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి ఆలయ వేద పండితుడిపై సస్పెన్షన్ వేటు పడింది. సినీ నటుడు శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేటుగా నవగ్రహ శాంతి పూజలు నిర్వహించిన వ్యవహారంపై శ్రీకాళహస్తి ఆలయ అర్చకుడిపై ఆలయ అధికారులు… pic.twitter.com/MvR8sVDeI8
