1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Stop selling alcohol: Women’s Union protest

మద్యం అమ్మకాలు నిలిపివేయాలి: మహిళా సంఘం నిరసన

alcohol
మద్యం అమ్మకాలు నిలుపుదల చేయాలంటూ విజయవాడ ధర్నా చౌక్ వద్ద నిరసన చేపట్టారు. మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు పెనుమత్స దుర్గా భవాని ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

కరోనా ప్రబలకుండా ఉండాలంటే మద్యం అమ్మకాలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మద్యపానం నిషేధం అన్న ముఖ్యమంత్రి ఈ సమయంలో నిషేధం చేయాలని కోరారు.

మద్యం అమ్మకాలు కారణంగా మళ్ళీ కరోనా విజృంభించే అవకాశం ఉందని, ఇంతే కాక పనులు లేక ప్రజలు అల్లాడుతున్న తరుణంలో  మద్యం అమ్మకాలు పేదల కుటుంబాల్లో చిచ్చు పెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 
తర్వాతి కథనం
నా మొగుడికి 40 రోజులుగా మద్యం లేదు.. పైగా ఎండలో నిల్చోలేడు.. అందుకే...