ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 1 మే 2020 (16:38 IST)

మద్యం అమ్మకాలకు మహారాష్ట్ర సర్కారు గ్రీన్ సిగ్నల్

మహారాష్ట్రలో మూతపడిన మద్యం విక్రయాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ విషయంపై మహారాష్ట్ర సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మద్యం దుకాణాలు తెరుచుకోనున్నాయి.
 
కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. జనం ఇళ్ల నుంచి అత్యవసరాల కోసం మాత్రమే వస్తున్నారు. అయితే ఆదాయం పూర్తిగా పడిపోవడంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మద్యం అమ్మకాలను తిరిగి ప్రారంభించాలని యోచిస్తున్నాయి.

ఈ తరుణంలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే ముందడుగు వేశారు. అయితే మద్యం దుకాణాల వద్ద సామాజిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం వంటి నిబంధనలు యథాతథంగా ఉంటాయి.
 
మహారాష్ట్రలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. ఇప్పటివరకూ పది వేల కేసులు నమోదయ్యాయి. 432 మంది చనిపోయారు. దేశంలో ప్రస్తుతం రెండోదశ లాక్‌డౌన్ కొనసాగుతోంది. మూడోదశపై నిర్ణయం వెలువడాల్సి ఉంది.