తెలంగాణలో మరో ఐదు మద్యం డిపోలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నీరా విధానం గురించి మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులతో సమీక్షించారు. ఇప్పుడున్న మద్యం డిపోలకు మరో 5 అదనంగా ఏర్పాటు చేసేందుకు తగిన స్థలాలను ఎంపిక చేయాలని ఆదేశించారు.
రాష్ట్రంలో ఇప్పుడున్న మద్యం డిపోలకు మరో ఐదు అదనంగా ఏర్పాటు చేసేందుకు తగిన స్థలాలను ఎంపిక చేయాలని అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నీరా విధానం గురించి రవీంద్రభారతిలోని మంత్రి కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. సేకరణ, నిల్వ, మార్కెటింగ్‌లతో పాటు నీరా కేఫ్ తదితర అంశాలపై చర్చించారు.
ఇప్పుడున్న మద్యం డిపోల నుంచి దుకాణాలకు చేరవేత కొంత ఇబ్బందిగా ఉందన్నారు. కొన్ని చోట్ల దూరం ఎక్కువ కావడంతో ఆలస్యం అవుతున్నందున కొత్తగా మరో ఐదు డిపోలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
హైదరాబాద్ నగర శివారులో మూడు, సూర్యాపేటలో ఒకటి, మంచిర్యాల ప్రాంతంలో మరొకటి ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు.