శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 22 ఫిబ్రవరి 2020 (13:39 IST)

నిఘా వర్గాల హెచ్చరికలు... రోహింగ్యా ముస్లింలపై దృష్టి

కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో రోహింగ్యా ముస్లింలపై తెలంగాణ రాష్ట్ర పోలీసులు ప్రత్యేక దృష్టిసారించారు. రాచకొండ, సైబరాబాద్ కమిషనరెట్లో దాదాపు 4 వేల రోహింగ్యాలున్నటు సమాచారం. 
 
రోహింగ్యాల వద్ద ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, డైవింగ్ లైసెన్సు, ఇండియన్ పాస్ పోర్ట్, రేషన్ కార్డులు, బ్యాంక్ అకౌంట్లు లభ్యం. కొందరు రోహింగ్యాలు బ్యాంక్ రుణాలు తీసుకున్నారు. రాష్ట్ర సంక్షేమ పథకాలు వాడుతున్నట్లు సమాచారం.
 
బాలాపూర్ క్రిసెంట్ స్కూల్ కరెస్పాండంట్ అబ్దుల్ కాలిక్యు తన స్కూల్ నుంచి స్కూల్ బోనోఫైడ్ ఇవ్వడంతో అరెస్ట్. రోహింగ్యాలకు భారత పౌరసత్వం పొందే ధృవపత్రాలు సహకరిస్తున్న ఏజెంట్లు మహ్మద్ ఫయాజ్, మహ్మద్ ఫైజల్, సయ్యద్ నయీంలను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
 
నగరంలో నిర్వహించే కార్డెన్ సెర్చ్‌లలో రోహింగ్యాల వివరాలు ఆధారాలు సేకరించి ఉన్నతాధికారులకు సమర్పించాలని ఆదేశాలు జారీ. కార్డెన్ సెర్చ్‌లో ఆధారాలు తనిఖీ చేసి సమయంలో ఓ పోలీస్ అధికారిని ఎంఐఎం ప్రజాప్రతినిధి అడ్డుపడ్డ విషయం తెలిసిందే. మరో ప్రజాప్రతినిధి 127 మంది ఆధార్ కార్డులు విషయంలో అడ్డుపడ్డ విషయం కూడా తెలిసిందే.