మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 29 జనవరి 2020 (15:58 IST)

బీజేపీలోకి బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్...

బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ సంచలన నిర్ణయం తీసకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పాలన పట్ల ఆకర్షితురాలైన సైనా.. బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆమె పార్టీలో చేరడంతో ఢిల్లీ ఎన్నికల్లో ప్రభావం కనిపించవచ్చని పలువురు బీజేపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి సైనా.. ప్లే గేమ్ నుంచి పొలిటికల్ గేమ్‌లోకి అడుగుపెడుతుంది. 
 
బీజేపీ జనరల్ సెక్రటరీ సమక్షంలో ఆమె బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు. సైనా ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం నిర్వహిస్తారని సమాచారం. సైనా భారత్ తరపున మూడుసార్లు ఒలంపిక్స్‌లో ప్రాతినిధ్యం వహించారు. రెండోసారి పాల్గొన్నప్పుడు కాంస్య పతకం సాధించారు. సైనా మొత్తం బ్యాడ్మింటన్ కెరీర్‌లో 24 టైటిళ్లు సాధించారు.