శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 21 జనవరి 2020 (08:40 IST)

బీజేపీ అధ్యక్షుడిగా జేపీ నడ్డా

బీజేపీకి కొత్త సారధి వచ్చారు. ఇన్నాళ్లూ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా వున్న జేపీ నడ్డా.. పూర్తి స్థాయి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఐదున్నరేళ్ల పాటు ఈ పదవిలో ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా స్థానే పూర్తిస్థాయి అధ్యక్షుడిగా లాంఛనంగా నియమితులయ్యారు.

నిజానికి ఏడాది కాలంగా నడ్డా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బీజేపీని అగ్రస్థానంలో నిలిపిన అమిత్‌ షాకు పనిభారం ఎక్కువ కావడంతో నడ్డాయే సంస్థాగత వ్యవహారాలన్నీ చూసుకుంటున్నారు. అన్ని రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ముగిసిందనీ, అధ్యక్ష పదవికి నడ్డా అభ్యర్థిత్వం ఒక్కటే వచ్చిందనీ ఎన్నికల ఇన్‌చార్జి రాధామోహన్‌సింగ్‌ ప్రకటించారు.

షాతో పాటు మాజీ అధ్యక్షులు రాజ్‌నాథ్‌, గడ్కరీ -నడ్డా పేరు ప్రతిపాదించగా పార్లమెంటరీ బోర్డు ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ నియామకంతో బీజేపీలో గడ్కరీ తరువాత బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి ఐదో వ్యక్తి పార్టీ చీఫ్‌ అయ్యారు.  నడ్డా బీజేపీ 11వ అధ్యక్షుడు.
 
 
జగత్‌ ప్రకాశ్‌ నడ్డా 1960 డిసెంబరు 2న హిమాచల్‌లోనే జన్మించారు. అయితే ఆయన తండ్రి ఎన్‌ ఎల్‌ నడ్డా రాంచీ విశ్వవిద్యాలయ ఉప కులపతిగా నియమితులవడంతో కుటుంబం బిలా్‌సపూర్‌కు వెళ్లింది. కొన్నాళ్ల తరువాత నడ్డా పట్నాకు మారడంతో అక్కడే సెయింట్‌ జేవియర్‌ స్కూల్లో చదివారు.

ఆర్‌ఎ్‌సఎస్‌ భావజాలం చిన్ననాటి నుంచే ఆయనను ఆకర్షించింది. కాలేజీ రోజుల్లో ఏబీవీపీ నేత అయ్యారు. పట్నా వర్సిటీలో బీఏ చదివారు. ఎమర్జెన్సీ సమయంలో నిరసన ప్రదర్శనలు తీసినందుకు ఆయన 45 రోజుల పాటు నిర్బంధంలో ఉన్నారు.
 
ఆయన ఎల్‌ఎల్‌బీ చదవడానికి మళ్లీ హిమాచల్‌ ప్రదేశ్‌ వెళ్లిపోయారు. అక్కడ న్యాయశాస్త్రంలో మాస్టర్స్‌ చేశాడు. 1993లో తొలిసారి హిమాచల్‌ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తరువాత వరుసగా 1998, 2007లో కూడా ఎమ్మెల్యే అయ్యారు. శాంతకుమార్‌ మంత్రివర్గంలో కూడా పనిచేశారు. 2010లో ఆయన జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా నితిన్‌ గడ్కరీ ఆయనను నియమించారు.

దాంతో 2012లో మళ్లీ రాష్ట్ర అసెంబ్లీకి పోటీచేయకుండా రాజ్యసభ సభ్యుడై జాతీయ రాజకీయాల్లోనే ఉండిపోయారు. అప్పుడే మోదీ హవా మొదలవుతోన్న కాలం... ఆ సమయంలో ఆయన మోదీ-షాలకు చేరువయ్యారు. ఫలితంగా 2014లో మోదీ అధికారంలోకొచ్చాక ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు.
 
2019లో ఆయనను స్వ యంగా తన వారసుడిగి ఎం పిక చేసి ఎదిగేదాకా తానూ బాధ్యతలను పంచుకున్నారు షా! నడ్డా నేతృత్వంలో యూపీలో బీజేపీ 80 సీట్లకు గాను 62 స్థానాలు గెలుచుకోగలిగింది. సా మాజిక మంత్రాంగం షా చేస్తే దాన్ని పక్కాగా అమలు చేసినవారు నడ్డా!

స్వయంగా ఎన్నికల ఇన్‌చార్జిగా వ్యవహరించి ఎస్పీ-బీఎస్పీ కూటమిని దీటుగా ఎదుర్కోవడం ఆయనకు ప్లస్‌ పాయింటైంది. మని షి స్వతహాగా మృదుభాషి. ఏ ఆర్భాటం లేకుండా పని చక్కపెట్టగల దిట్ట. సంఘ్‌ పట్ల విశ్వాసం, బీజేపీ సిద్ధాంతాలపై నమ్మ కం ఉన్నవ్యక్తి. మోదీ-షాలకు నమ్మిన బంటు.

వారి ఛాయల్లోనే నడవాల్సి ఉన్నప్పటికీ ఇక ప్రత్యక్ష పర్యవేక్షణ ఉంటుంది. మున్ముందు జరిగే ఢిల్లీ, బెంగాల్‌, బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు నడ్డా నేతృత్వానికి తొలి పరీక్ష. ముఖ్యంగా ఆయన షాకు నమ్మకస్తుడైన నేత అని, మౌనంగా చెప్పిన పని చేసుకుపోతారని పార్టీ వర్గాలు అంటున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా ఆయన ఏనాడూ వివాదాస్పదంగా వ్యవహరించలేదు. 

2024 ఎన్నికలకు ముందు అవసరమైతే అమిత్‌ షా మరో సారి పార్టీ అధ్యక్షుడు అయ్యేందుకు వీలుగానే నడ్డా ఎంపిక జరిగిందని ఒక సీనియర్‌ నేత అన్నారు.