మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 13 జనవరి 2020 (23:45 IST)

ఢిల్లీలో బీజేపీ ముఖ్య నాయకులతో పవన్ భేటీ

ఢిల్లీ పర్యటనకై వెళ్లిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాను ఆయన నివాసంలో కలిశారు.

ఈ సమావేశంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి బి.ఎల్. సంతోష్, కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్‌తో పాటు నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు.
 
పవన్ కళ్యాణ్ తన అమరావతి పర్యటనను అకస్మాత్తుగా ముగించి ఢిల్లీకి వెళ్లడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. జేపీ నడ్డాతో భేటి అయిన పవన్.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి,  మూడు రాజధానుల అంశంపై ప్రస్తుతం అమరావతిలో జరుగుతున్న  రగడ మరియు అక్కడ రైతుల చేస్తున్న ఆందోళన గురించి నడ్డాతో చర్చించారు.

బీజేపీతో పొత్తు, భవిష్యత్తులో బీజేపీ తో కలిసి పనిచేసేందుకు కూడా పవన్ సుముఖం వ్యక్తం చేసినట్టు సమాచారం. నిన్న కొంత మంది ఆర్ ఆర్ ఎస్ ముఖ్య నాయకులను కూడా పవన్ కలిశారు.
 
అయితే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కోసం రెండు రోజుల నుంచి ఎదురు చూస్తున్న పవన్ కు నిరాశ ఎదురైంది. అమిత్ షా వేరే కార్యక్రమాలలో బిజీగా ఉండటం వల్ల పవన్ కు అమిత్ షాతో భేటి అయ్యే అవకాశం దొరకలేదు. ప్రస్తుతం పవన్ ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ బయలుదేరారు.