శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 30 నవంబరు 2019 (15:04 IST)

దశల వారీగా మద్యపాన నిషేధం - బెల్టు షాపుల తొలగింపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దశల వారీగా మద్యపానం నిషేదం అమలుకానుంది. ఇందులోభాగంగా, రాష్ట్రంలోని 44 వేల బెల్ట్‌షాపుల తొలగించారు. 4,380 మద్యం షాపుల్లో 880 తగ్గించి 3,500కు కుదింపు. ప్రభుత్వమే మద్యం షాపుల నిర్వహణ. బార్లలోనూ 40 శాతం తగ్గించాలని నిర్ణయం. మద్యం ధరలు పెంపు, లైసెన్స్‌ ఫీజు భారీగా పెంపు.
 
* మద్యం ముట్టుకుంటేనే షాక్‌ కొట్టేలా నిర్ణయాలు.. త్వరలో నూతన మద్యం విధానం అమలు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ మద్యం దుకాణాల్లో 3,500 మంది సూపర్‌వైజర్లు, 8,033 మంది సేల్స్‌మెన్‌ల నియామకం ద్వారా ఉపాధి కల్పన. మన బడి నాడు - నేడు - మనబడి నాడు - నేడులో భాగంగా 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం రూ.12 వేల కోట్లు కేటాయింపు. తొలి దశలో 15,715 పాఠశాలల్లో 9 రకాల సౌకర్యాలతో అభివృద్ధి. ప్రభుత్వ పాఠశాలల ఫొటోలు తీసి.. అభివృద్ధి చేశాక ఫొటోలతో తేడా చూపుతారు. 
 
* రాష్ట్ర అవినీతిని నిర్మూలించేందుకు 14400 కాల్‌ సెంటర్‌ ఏర్పాటు. ఈ నంబర్‌కు ఫోన్‌ చేసిన 15 నుంచి 30 రోజుల్లోగా దర్యాప్తు పూర్తి.. చర్యలు. ఒక్క ఫోన్‌ కాల్‌తో మీ వెంట మేమున్నామనేలా ప్రజలకు భరోసా కల్పిస్తారు. గత ప్రభుత్వ పెద్దల దోపిడీ తీరుకు భిన్నంగా, ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా కొత్త ఇసుక పాలసీ అమలు. ఎక్కడా అవినీతికి తావు లేకుండా చెక్‌పోస్టులు, సీసీ కెమెరాల ఏర్పాటు.  ఇసుక వారోత్సవంలో రూ.60 కోట్లు ఆదాయం. 
 
* వైఎస్సార్‌ రైతు భరోసా - రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా రూ.13,500 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 45.82 లక్షల మంది రైతులకు చెల్లింపులు పూర్తి. మరో 2.14 లక్షల మంది రైతులకు వారంలోగా చెల్లించాలని సీఎం ఆదేశం. మొత్తంగా 48 లక్షల మంది రైతులకు భరోసా. గ్రామ సచివాలయాల్లో రైతులకు అందుబాటులో నాణ్యమైన పురుగు మందులు, విత్తనాలు. వర్క్‌షాపుల్లో రైతులకు శిక్షణ. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు, ప్రతి నియోజకవర్గ కేంద్రంలో విత్తన, ఎరువుల పరీక్ష కేంద్రాలు.
 
* రూ.4 వేల కోట్లతో (కేంద్ర, రాష్ట్రాలు కలిపి) ప్రకృతి వైపరీత్యాల నిధి, అగ్రి కమిషన్, ఆయిల్‌పాం రైతులకు గిట్టుబాటు ధర కోసం నిధుల కేటాయింపు, కౌలు రైతుల కోసం సాగుదారుల హక్కుల బిల్లు, ఉచిత పంటల, పశు బీమా, గత ప్రభుత్వ ఇన్‌పుట్‌ సబ్సిడీ బకాయి రూ. 2 వేల కోట్లు విడుదల, ఇన్‌పుట్‌ సబ్సిడీ 15 శాతం పెంపు, వ్యవసాయ ల్యాబ్‌లు, ఉచిత బోర్లు, పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్, ఆక్వా రైతులకు యూనిట్‌ రూ.1.50కే కరెంట్‌ సరఫరా.
 
* శనగ రైతులకు రూ. 330 కోట్లు, ఆయిల్‌పామ్‌ రైతులకు తెలంగాణతో సమానంగా ధర చెల్లింపునకు రూ. 85 కోట్లు, పెదవేగి ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీ యాజమాన్య హక్కులు రైతులకు అప్పగింత. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7లక్షల పరిహారం, రైతులకు వడ్డీ లేని రుణాలు, చిరుధాన్యాల బోర్డు ఏర్పాటు.