శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 30 నవంబరు 2019 (09:59 IST)

వైకాపా నేతల అరాచకాలు తట్టుకోలేకపోతున్నాం....

వైకాపా నేతల అరాచకాలను తట్టుకోలేక పోతున్నామంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వద్ద గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గం నిజాంపట్నం టీడీపీ కార్యర్తలు బోరున విలపించారు. 
 
ఈ మేరకు చంద్రబాబును వారు స్వయంగా కలిసి ఫిర్యాదు చేశారు. నిజాంపట్నంలో వైసిపి నేతల అరాచకాలు తట్టుకోలేక పోతున్నాం. వీధికొక్క రౌడీని తయారు చేశారు. కాలు దువ్వుతున్నారు. ఇళ్ల మీదకు వస్తున్నారు. 
 
రౌడీ షీట్లు ఓపెన్ చేశాం, స్టేషన్‌కు రమ్మని బెదిరిస్తున్నారు. ఫిష్ ఫౌల్ట్రీ ఫామ్ ఆపేయించారు. బ్యాంకు రుణాలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామంటూ వాపోయారు. శుక్రవారం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును ఆయన నివాసంలో కలిసి తమ కష్టాలు విన్నవించారు. 
 
దీనిపై చంద్రబాబు స్పందిస్తూ, అందరూ ధైర్యంగా ఉండాలని, పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందని చెప్పారు. ధర్మం మనవైపే ఉందంటూ, అవసరమైతే ప్రైవేటు కేసులు వేద్దామని, న్యాయ పోరాటం చేధ్దామని ధైర్యం చెప్పారు.