మంత్రి బొత్స సత్యనారాయణను బర్త్‌రఫ్ చేయాలి : పసుమర్తి అనురాధ
రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న స్పీకర్ మహిళలను అవమానించేలా మాట్లాడుతారా? మంత్రులు, స్పీకర్ బూతులు మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు? అంటూ టీడీపీ అధికార ప్రతినిధి పసుమర్తి అనురాధ ప్రశ్నించారు. ఆమె మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, సైబరాబాద్‌లా అమరావతిని నిర్మించాలని చంద్రబాబు నాయుడు సంకల్పించారు.
రాజధానిలో 35 లక్షల మందికి శాశ్వత నివాసం, 20 లక్షల మందికి ఉపాధి కల్పించాలని భావించారు. రాజధాని నుండి వచ్చిన ఆదాయంతో 13 జిల్లాలు అభివృద్ధి జరుగుతుంది. రాజధానిపై వైసీపీ నేతలు నక్క పురాణం చెప్పారు. రాజధాని ముంపుకు గురవుతుందని, వరద వస్తుందని, ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని, అవినీతి జరిగిందని రకరకాల ఆరోపణలు చేశారు. కానీ ఒక్కటి కూడా నిరూపించలేకపోయారు.
రాష్ట్రంలో మంత్రులు, స్పీకర్, ఎమ్మెల్యేలు మాట్లాడే మాటలు వింటుంటే.. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారా? లేక బూతుల మీడియం ప్రవేశపెట్టారా? అనే అనుమానం కలుగుతోంది. విద్యారుల్ని, నిరుద్యోగుల్ని ఒక మంత్రి కుక్కలతో పశువులు పోల్చారు. స్పీకర్ మహిళలను అవమానపరిచేలా మాట్లాడతారా? రాజ్యాంగబద్దమైన, బాధ్యతాయుతమైన స్సీకర్ ఇలాగేనా మాట్లాడేది.? అంటూ ప్రశ్నించారు.