సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 29 నవంబరు 2019 (15:43 IST)

సీఎం జ‌గ‌న్ అరెస్టు కాకూడ‌ద‌నే తాంత్రిక పూజ‌లు?

అక్ర‌మాస్తుల కేసులో బెయిల్ ర‌ద్దు అవుతుంద‌నే వార్త‌ల నేప‌థ్యంలో శ్రీకాళ‌హ‌స్తి దేవ‌స్థానం ప‌రిధి ఆల‌యంలో జ‌రిగిన తాంత్రిక పూజ‌లు తీవ్ర క‌ల‌క‌లం రేపుతున్నాయి. క్షుద్ర‌పూజ‌లు చేశార‌నే కార‌ణంతో అరెస్ట‌యిన వారిలో స్థానిక వైకాపా ప్ర‌జాప్ర‌తినిధి అనుచ‌రులు ఉండ‌టం ఈ అనుమానాల‌ను బ‌ల‌ప‌రుస్తోంది. 
 
తాంత్రిక పూజ‌ల‌ను అన్నీ తానే అయి న‌డిపించిన ఆల‌య స‌హాయ కార్య‌నిర్వ‌హ‌ణాధికారి.. స్థానిక వైకాపా ప్ర‌జాప్ర‌తినిధికి అత్యంత ఆప్తుడ‌ని స‌మాచారం. ఇది కూడా జ‌గ‌న్ అరెస్టు కాకూడ‌ద‌నే ల‌క్ష్యంతో తాంత్రిక పూజ‌లు నిర్వ‌హించార‌నే వార్త‌ల‌ను బ‌ల‌ప‌రుస్తోంది. 
 
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు కానుంద‌ని, త్వ‌ర‌లో అరెస్టు అవుతార‌ని జోరుగా ప్ర‌చారం సాగుతోంది. త‌న త‌దుప‌రి సీఎం పీఠంపై భార్య భార‌తిని కూర్చోపెట్టేందుకు పాల‌న‌పై ఆమెకు శిక్ష‌ణ ఇప్పిస్తున్నార‌ని కూడా వార్త‌లు గుప్పుముంటున్నాయి. అక్ర‌మాస్తుల కేసులో ప్ర‌తీ శుక్ర‌వారం కోర్టుకు హాజ‌రు నుంచి మిన‌హాయింపు ఇవ్వాల‌ని జ‌గ‌న్ పెట్టుకున్న పిటిష‌న్‌ని కోర్టు కొట్టేసింది. ఈ సంద‌ర్భంగా కోర్టు వ్యాఖ్య‌లు, సీబీఐ కౌంట‌ర్ కూడా జ‌గ‌న్‌కి వెన్నులో వ‌ణుకు పుట్టించింది. 
 
ఈడీ, సీబీఐ కేసుల్లో సుదీర్ఘ కాలంగా బెయిల్ పై ఉన్న‌వారి బెయిల్ ర‌ద్దు చేసి విచార‌ణ త్వ‌ర‌గా పూర్తిచేయాల‌ని కేంద్రం ఆదేశాలిచ్చింది. షాకుల మీద షాకుల‌తో మూలిగే న‌క్క‌లా ఉన్న జ‌గ‌న్‌పై తాటిపండు ప‌డ్డ‌ట్టు.. కేంద్రంతో ఉన్న ర‌హ‌స్య అవ‌గాహ‌న‌ కూడా బెడిసికొట్టేసింది. 
 
రివ‌ర్స్ టెండ‌ర్లు, పీపీఏల ర‌ద్దు, ఇంగ్లీష్ మీడియం అమ‌లు వంటి నిర్ణ‌యాల‌ను కేంద్ర అభీష్టానికి వ్య‌తిరేకంగా జ‌గ‌న్ తీసుకోవ‌డంతోపాటు రాష్ట్రాన్ని కిర‌స్తానీప్ర‌దేశ్‌గా మార్చే అజెండా అమ‌లు చేస్తున్నార‌నే ఆగ్ర‌హంలో ఉంది కేంద్రం. ఇటువంటి ప్ర‌తికూల ప‌రిస్థితుల నేప‌థ్యంలో బెయిల్ ర‌ద్ద‌యి జ‌గ‌న్ జైలుకు వెళ్లే అవ‌కాశం ఉంద‌ని వైకాపా కీల‌క‌నేత‌ల నుంచీ కార్య‌క‌ర్త‌ల వ‌ర‌కూ ఆందోళ‌న‌లో ఉన్నారు. 
 
ఈ ఆందోళ‌న‌లోనే జ‌గ‌న్ కూడా తాను జైలుకెళ్లే లోపు ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టేందుకు సంక్షేమ కార్య‌క్ర‌మాలు త్వ‌ర‌గా అమ‌లు చేయాల‌ని, అవినీతి లేకుండా చూడాల‌ని క‌ల‌రింగ్ ఇస్తున్నార‌ని విశ్లేష‌కుల అభిప్రాయప‌డుతున్నారు. 
 
మ‌రోవైపు త‌న‌పై ఎలాగూ క‌ర‌డుగ‌ట్టిన క్రిస్టియ‌న్ అనే ముద్ర‌ప‌డిన నేప‌థ్యంలో, ఆయా వ‌ర్గాలు కూడా త‌న‌ను వారి మ‌త‌ప‌రిర‌క్ష‌కుడిగా భావిస్తున్న ప‌రిస్థితుల‌ను త‌న‌కు అనుకూలంగా మ‌ల‌చుకునే ప్లాన్ జ‌గ‌న్ అండ్ కో అమ‌లు చేస్తోంద‌ని స‌మాచారం. 
 
జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు కాకూడ‌ద‌ని, ఎట్టి ప‌రిస్థితుల్లో అరెస్ట్ కాకూడ‌ద‌ని ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న చ‌ర్చిల‌లో ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు నిర్వ‌హిస్తున్నార‌ట‌! 
 
త‌న అభిమాన నాయ‌కుడు జ‌గ‌న్ మ‌న‌సు ఎలాగైనా గెలుచుకోవాల‌నే ఉద్దేశంతో శ్రీకాళ‌హ‌స్తికి చెందిన వైకాపా ప్ర‌జాప్రతినిధి త‌న‌కు అత్యంత ఆప్తుల‌కు ఈ క్షుద్ర‌పూజ‌లు చేయించాల‌ని పుర‌మాయించార‌ట! 
 
అస‌లే అధికార పార్టీ.. ఆపై ఆదేశించింది స్థానిక వైకాపా ప్ర‌జాప్ర‌తినిధి.. ఈ రెండు అంశాల‌తో దేవ‌దాయ ధ‌ర్మ‌దాయ శాఖ స‌హాయ కార్యనిర్వ‌హ‌ణాధికారి ధ‌న‌పాల్‌ ఏకంగా శ్రీకాళ‌హ‌స్తి ప్ర‌ధాన ఆల‌య అనుబంధ ఆల‌యంలో క్షుద్ర‌పూజ‌లు చేశారు. 
 
శ్రీకాళహస్తి ఆలయానికి అనుబంధంగా ఉన్న నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో అమావాస్య అర్థరాత్రి గుడిలోనుంచి పెద్ద పెద్దగా మంత్రాలు వినిపిస్తున్నాయి. 
 
ఆలయం చుట్టుపక్కల నివసించే స్థానికులు ఈ వ్యవహారంతో భయపడ్డారు. తీవ్ర ఆందోళ‌న‌కు గురైన స్థానికులు వెళ్లి చూస్తే లోపల తాంత్రిక‌ పూజలు చేయ‌డాన్ని గ‌మ‌నించారు. వెనువెంట‌నే పోలీసులూ రంగంలోకి దిగారు. 
 
అయితే స్థానిక వైకాపా ప్ర‌జాప్ర‌తినిధికి స‌మాచారం అంద‌డంతో కేసును పూర్తిగా గ‌తంలో తాంత్రిక పూజ‌లు నిర్వ‌హించిన కేసులో స‌స్పెండ‌యిన ధ‌న‌పాల్‌పైకి నెట్టేయాల‌ని, జ‌గ‌న్ అరెస్టు కాకూడ‌ద‌నే ల‌క్ష్యంతో ఈ తాంత్రిక పూజ‌లు జ‌రిగిన‌ట్టు ఎక్క‌డా బ‌య‌ట‌కు రాకూడ‌ద‌ని ఆదేశించార‌ట‌! దీంతో పోలీసులు కేసు విష‌యంలో ఏమీ పెద్ద‌గా మాట్లాడ‌టం లేదు. ఒక‌సారి తాంత్రిక పూజ‌లు చేస్తూ స‌స్పెండ్ అయి కూడా మ‌ళ్లీ ఇలా తాంత్రిక పూజ‌ల‌కు ధ‌న‌పాల్ తెగ‌బ‌డ‌టం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. 
 
అధికార పార్టీ నేత అండ‌దండ‌లు, ఆదేశాల‌తో ద‌న‌పాల్ త‌మిళ‌నాడు నుంచి క్షుద్ర‌పూజ‌లు చేసే స్పెష‌లిస్టుల‌ను ర‌ప్పించి పూజ‌లు చేశార‌ని..అందుకే తొణ‌క‌డంలేదు, బెణ‌క‌డంలేద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

క్రిస్టియ‌న్ అయిన జ‌గ‌న్‌కి కూడా క్షుద్ర‌పూజ‌ల ఫ‌లం అందుతుందా? అనేది ప‌క్క‌న‌బెడితే సీఎం జ‌గ‌న్ ప్రాప‌కం పొందేందుకు స్థానిక వైకాపా ప్ర‌జాప్ర‌తినిధే ఈ మొత్తం త‌తంగ‌మంతా న‌డిపించార‌ని ప్ర‌చారం జోరుగా సాగుతోంది.