మహిళామణులు కాదు.. పేకాట రాణులు...

playing cards
ఠాగూర్| Last Updated: సోమవారం, 25 నవంబరు 2019 (13:42 IST)
గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఆడుతున్న పలువురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి లక్షా 36 వేల రూపాయలను కూడా స్వాధీనం చేసుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,

తాడేపల్లి పట్టణంలో మహిళలు విచ్చలవిడిగా పేకాట ఆడుతున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు పేకాట శిబిరాలను గుర్తించి వాటిపై ఆకస్మిక దాడులు నిర్వహించారు.

ముఖ్యంగా, పట్టణంలోని మహానాడు పట్టాభి రామయ్య కాలనీ ప్రాంతంలోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో తాడేపల్లి సీఐ అంకమ్మరావు మహిళా పోలీసులతో కలసి ఆదివారం రాత్రి దాడి చేశారు.

ఈ దాడిలో పేకాట ఆడుతున్న 8 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి లక్షా 36 వేల 250 రూపాయల నగదును, 8 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.దీనిపై మరింత చదవండి :