శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. వ్యక్తిత్వ వికాసం
Written By సెల్వి
Last Updated : గురువారం, 21 నవంబరు 2019 (14:12 IST)

సహోద్యోగులతో ఆ విషయాలు షేర్ చేసుకోవద్దు? పవర్ న్యాప్ చేస్తున్నారా?

చాలామంది ఉద్యోగినులు తమకు సంబంధించిన విషయాలు సహోద్యోగులతో పంచుకుంటారు. అందులో వ్యక్తిగత విషయాలు కూడా వుంటాయి. కానీ వ్యక్తిగత విషయాలను సహోద్యోగులతో షేర్ చేసుకోవడం సరికాదు అంటున్నారు.. మానసిక నిపుణులు.

అవి గాసిప్‌లకు దారితీస్తాయని వారు చెప్తున్నారు. అలాంటి సమస్యలు ఎదురు కాకుండా వుండాలంటే.. సహోద్యోగులతో ఎంతో సన్నిహితంగా వుంటున్నా సరే వ్యక్తిగత విషయాలను పంచుకునే ప్రయత్నం చేయవద్దు. ఇందులో ఓ సరిహద్దు గీసుకోవడం మంచిది. 
 
అలాగే ఉద్యోగినులు పవర్ న్యాప్ కూడా చేయాలని వైద్యులు చెప్తున్నారు. ఉద్యోగినులకు నిద్రలేమి సమస్య ఎదురవుతుంటుంది. ఉద్యోగినులు ఐదారు గంటలైనా నిద్రపోరు. ఆ ప్రభావం తరువాతి రోజుపై పడుతుంది. ఫలితంగా అనారోగ్యాలు చుట్టుముడుతాయి. అందుకే ఓ పని చేయాలి. అదేంటంటే అవకాశం ఉన్నప్పుడల్లా పది నుంచి 15 నిమిషాలు కునుకు తీసేందుకు ప్రయత్నించండి. దీన్ని పవర్ న్యాప్ అంటారు. అలా చేస్తే రోజంతా చురుగ్గా వుండొచ్చునని అధ్యయనాలు తేల్చాయి. 
 
ఇక ఉద్యోగినులు అల్పాహారం తీసుకునేందుకు సమయం లేకపోతే.. ఓ శాండ్‌విచ్ లేదా రెండు పండ్లు తీసుకెళ్తే బెటర్. ఆఫీసుకు వెళ్తూ తినొచ్చు. కుదిరితే గ్లాసు పాలు తాగినా మేలు. శరీరానికి కొంత శక్తి అందుతుంది. ఇక ముఖ్యంగా ఉద్యోగినులు టెక్నాలజీ కాస్త దూరంగా వుండటం మంచి ఫలితాలను ఇస్తుంది. 
 
ఒత్తిడికి లోనుకాకుండా వుండాలంటే ప్రణాళిక వేసుకోవాలి. రోజంతా ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్ టాప్‌ల జోలికి వెళ్లకూడదు. అంటే వారంలో ఓ రోజు నో టెక్నాలజీ డే అని పెట్టుకుంటే.. అనారోగ్యాలను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.