1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. An mp was dismissed due to sandwich stole

శాండ్ విచ్‌ను దొంగలించాడు.. పార్లమెంట్ సభ్యుడి పదవి ఊడింది..

MP
శాండ్ విచ్‌ను దొంగలించిన పార్లమెంట్ సభ్యుడి పదవి ఊడింది. ఇది మనదేశంలో కాదు లెండి. స్లోవేనియాలో. స్లోవేనియా దేశానికి చెందిన పార్లమెంట్ సభ్యులు ఒకరు ఓ సూపర్ మార్కెట్‌లో శాండ్‌విచ్ దొంగలించిన కారణంగా.. ఆయన్ని పదవి నుంచి తొలగించారు. వివరాల్లోకి వెళితే.. స్లోవేనియాలోని ల్యూపిలియానా అనే ప్రాంతంలోనే ఓ సూపర్ మార్కెట్లో శాండ్ విచ్‌ కొనేందుకు 54ఏళ్ల తర్జ్ అనే పార్లమెంట్ సభ్యుడు వెళ్లారు. 
 
అయితే ఈ షాపులో శాండ్ విచ్ కొనుక్కొని డబ్బులివ్వకుండా వెళ్తే ఏం జరుగుతుందని.. ఆ షాపులోని భద్రతను పరీక్షించేందుకే శాండ్ విచ్‌ను తీసుకెళ్లానని తర్జ్ అన్నారు. అయితే ఆ దేశ మీడియా మాత్రం బిల్లు కట్టకుండా శాండ్ విచ్ తర్జ్ దొంగలించారని కోడైకూశాయి. కానీ మీడియా ఓవరాక్షన్‌ చూసి షాకయ్యానని ఒక మూడు నిమిషాలు బిల్లు కట్టేసి వుంటే ఏ బాధా వుండేది కాదని తర్జ్ చెప్పారు. ఈ చర్యపై తర్జ్ క్షమాపణలు చెప్పినా.. ఆయన పార్లమెంట్ పదవిని కోల్పోవాల్సి వచ్చింది. 
తర్వాతి కథనం
పుల్వామా ఘటన.. అఖిలపక్షానికి పిలుపునిచ్చిన కేంద్రం.. ప్రతీకారం కోసం..?