గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : గురువారం, 14 ఫిబ్రవరి 2019 (17:50 IST)

చంద్రబాబుకు షాకిచ్చిన అవంతి శ్రీనివాస్ : నువ్వు ఉంటే ఎంతా.. పోతే ఎంత? బాబు ఫైర్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ తేరుకోలేని షాకిచ్చారు. ఆయన తెలుగుదేశం పార్టీతో పాటు.. తన లోక్‌సభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన నేరుగా జగన్ మోహన్ రెడ్డి వద్దకు వెళ్ళి వైకాపాలో చేరిపోయారు. 
 
ఈ పరిణామంపై సీఎం చంద్రబాబు స్పందించారు. మొన్నే చీరాల ఎమ్మెల్యే ఒకాయన వచ్చి మళ్లీ పోయారన్నారు. ఇంకొకాయన ఇక్కడ ఎంపీగా ఉండి ఈరోజు లోటస్ పాండ్‌కు వెళ్లిపోయారని చెప్పారు. 'నేను ఈ నాయకులకు భయపడాలా అని మిమ్మల్ని అడుగుతున్నా' అని ప్రజనుద్దేశించి ప్రశ్నించారు. 'నేను నీ కోసం పనిచేయాలా.. వీళ్ల కోసం పనిచేయాలా అని అడుగుతున్నా' అని అవంతి శ్రీనివాస్‌ను ఉద్దేశించి చంద్రబాబు ప్రశ్నించారు. 
 
కాగా, నిన్నటికి నిన్న చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీని వీడి వైసీపీ అధినేత జగన్‌ను కలిశారు. వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. 24 గంటలు కూడా గడవక ముందే విశాఖ జిల్లా అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ టీడీపీని వీడి వైసీపీలో చేరడం ఇపుడు రాష్ట్ర రాజకీయాల్లో జంపింగ్ రాజకీయాలు ఊపందుకున్నాయని చెప్పొచ్చు.