శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (18:37 IST)

అబ్బే... మహేష్ బాబుకు ఆ లక్ష్యాలు లేవండి.. బాబూ.. నమ్రత

తెలుగుదేశం పార్టీ తరపున టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రచారం చేస్తారని జోరుగా ప్రచారం సాగింది. టీడీపీకి మద్దతుగా మహేష్ బాబు ప్రచారం చేసేందుకు సన్నద్ధమవుతున్నారని వస్తున్న వార్తపై ప్రిన్స్ సతీమణి, సినీ నటి నమ్రత స్పందించారు. టీడీపీ తరపున మహేష్ ప్రచారం చేసేదేమీ వుండదని స్పష్టం చేశారు. టీడీపీకే కాదు.. ఏ రాజకీయ పార్టీకి మహేష్ బాబు ప్రచారం చేయబోరన్నారు.
 
ఎన్నికల్లో పోటీ చేయాలనే కోరిక కానీ, రాజకీయ లక్ష్యాలు కానీ మహేష్‌కు లేనేలేవని తేల్చేశారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబు అంటే మహేష్ బాబుకు గౌరవం వుందని.. అలాగని చంద్రబాబు పక్కన మహేష్ కనిపించేస్తే.. ఆయన రాజకీయాల్లో వస్తున్నట్టు అర్థం కాదని నమ్రత వెల్లడించారు.  
 
మహేష్ బాబు సమయం అంతా సినిమాలకే సరిపోతుందని.. కుటుంబంతోనే గడిపే సమయమే ఆయనకు ఫ్రీ టైమ్ అన్నారు. స్నేహితులను కలవడానికి కూడా మహేష్ బయటకు వెళ్లట్లేదని నమ్రత చెప్పుకొచ్చారు. అన్నీ ట్యాక్సులు చెల్లించినా.. నిజం మహేష్ వైపు వున్నా.. పన్నులు చెల్లించలేదంటే ఏమీ చేయలేమని.. నవ్వుతూ వుండిపోవాల్సిందేనని నమ్రత అన్నారు.