ఈ నగరానికి ఏమైంది? డైరెక్టర్‌ని ఫుల్ స్క్రిప్టుతో రమ్మన్న మహేశ్
సూపర్ స్టార్ మహేష్ బాబు యంగ్ డైరెక్టర్స్‌తో వర్క్ చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అర్జున్ రెడ్డి సంచలన విజయం సాధించిన తర్వాత సందీప్ రెడ్డి వంగతో సినిమా చేయాలనుకున్నారు. సందీప్ రెడ్డితో మాట్లాడడం... కథ ఉంటే చెప్పమని అడగడం అంతా అర్జున్ రెడ్డి రిలీజైన పది పదిహేను రోజుల్లోనే జరిగింది. మహేష్ బాబు కమిట్‌మెంట్స్ వలన ఆలస్యం అయ్యింది. సుకుమార్‌తో చేయనున్న సినిమా తర్వాత మహేష్, సందీప్ రెడ్డి సినిమా చేసే ఛాన్స్ ఉంది.
ఇదిలా ఉంటే... ఇటీవల ఎఫ్ 2 సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో మహేష్ సినిమా చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు. అనిల్ కథ చెప్పడం... మహేష్ కథ నచ్చి ఫుల్ స్ర్కిప్ట్ రెడీ చేయమని అడగడం జరిగింది.
లేటెస్ట్ న్యూస్ ఏంటంటే... పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది చిత్రాలతో ఆకట్టుకున్న తరుణ్ భాస్కర్‌తో మహేష్ సినిమా చేయాలనుకుంటున్నాడట. తరుణ్ భాస్కర్ కూడా మహేష్ బాబుకి ఓ స్టోరీ లైన్ వినిపించాడట. లైన్ నచ్చడంతో ఫుల్ స్ర్కిప్టుతో రమ్మని మహేష్ చెప్పాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ప్రచారంలో ఉన్న ఈ వార్త నిజమా కాదా అనేది తెలియాల్సివుంది.