1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Megastar Chiranjeevi praises Mahesh Babu's AMB theaters

మహేష్ బాబు టేస్టే వేరు... మెచ్చుకున్న మెగాస్టార్... ఎందుకు?

Megastar Chiranjeevi
మహేష్ బాబు తాజాగా వ్యాపార రంగంలో అడుగుపెట్టాడు. గత ఏడాది డిసెంబర్ నెలలో గచ్చిబౌలి ప్రాంతంలో ఎఎమ్‌బి సినిమా మల్టీప్లెక్స్‌ను కృష్ణ చేతుల మీదుగా ప్రారంభించారు. అప్పటి నుండి సినీరంగ ప్రముఖులు ఇందులో సినిమాలను చూడటానికి ఆసక్తి చూపుతున్నారు. అందులో ఉన్న అత్యాధునిక సౌలభ్యాలను చూసి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. చిరంజీవి, సమంత, బాలయ్య మొదలైన సినీ ప్రముఖులు ఈ థియేటర్లను సందర్శిస్తున్నారు.
 
ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు చిత్రాన్ని డైరెక్టర్ క్రిష్ బాలయ్యతో కలిసి ఇందులో వీక్షించారు. ఈ సందర్భంగా క్రిష్ మాట్లాడుతూ మా సినిమా చాలా థియేటర్లలో మేము అనుకున్నంత క్లారిటీగా రాలేదు, కానీ ఇక్కడ మాత్రం సౌండ్, క్లారిటీ అంతా చాలా బాగుందని చెప్పారు. ఇక మెగాస్టార్ తన బావమరిదితో కలిసి కంగనా రనౌత్ నటించిన మణికర్ణిక సినిమాను చూసారు. 
 
ఇలా ఎంతోమంది ప్రముఖులు అత్యాధునిక హంగులతో నిర్మించబడిన ఈ మల్టీప్లెక్స్‌లో సినిమాలను చూస్తూ ఆనందిస్తున్నారు. ఇక సాధారణ ప్రజలకు డబుల్ ధమాకా. సినిమాలకు సినిమాను ఎంజాయ్ చేయవచ్చు, సెలబ్రిటీలను చూసే ఛాన్సూ కొట్టేయచ్చు.
About Writer
ప్రీతి చిచ్చిలి
తర్వాతి కథనం
పిచాయ్ నాయకత్వంపై నమ్మకం సన్నగిల్లుతోందా?