ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన ఆ నలుగురు హీరోలు... ఫైన్ వసూలు
హైదరాబాద్ నగరంలో నలుగురు అగ్ర హీరోలు ట్రాఫిక్ రూల్స్‌ను అధికమించారు. దీంతో వారికి హైదరాబాద్ నగర్ ట్రాఫిక్ పోలీసులు అపరాధం విధించారు. ఆ ఇద్దరు హీరోలు ఎవరో కాదు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, బాలయ్య, నితిన్‌లు ఉన్నారు.
ప్రిన్స్ మహేష్ బాబు పేరుమీద రిజిస్టర్ అయినవున్న ఏపీ09 సీఎం 4005 అనే కారు అతివేగం కారణంగా గత 2016 నుంచి 2018 మధ్య కాలంలో ఏడుసార్లు జరిమానా విధించారు.
అలాగే పవన్ కళ్యాణ్ పేరుమీద రిజిస్టర్ అయిన ఏపీ 09 సీజీ 7778 అనే కారు కూడా రాంగ్ పార్క్ కారణంగా పోలీసులు మూడుసార్లు అపరాధం విధించారు. వీరిద్దరితో పాటు.. హీరోలు బాలయ్య, నితిన్ కార్లకు కూడా ఓవర్ స్పీడ్ కారణంగా ట్రాఫిక్ పోలీసులు అపరాధం విధించారు.