సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Modified: గురువారం, 10 జనవరి 2019 (18:21 IST)

ఎన్టీఆర్ గారు కుక్కను నిలబెట్టినా గెలుస్తుంది అన్నారు: పవన్ కళ్యాణ్

ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ ఏపీలో హీట్ పెరిగిపోతోంది. రాజకీయ నాయకుల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఇదిలావుంటే తాజాగా జనసేన అధ్యక్షలు పవన్ కళ్యాణ్ గారు ఓ విషయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.
 
''ఎన్టీఆర్ గారు మెదక్‌లో కుక్కను నిలబెట్టినా గెలుస్తుంది అని మాట్లాడారు, ఆ ఎన్నికలలో ఆయన పరాజయం పాలయ్యారు, నా వెనుక లక్షలాది మంది జనసైనికులు ధవళేశ్వరం అయినా, అనంతపురంలో అయినా వచ్చారని నేను తలకి ఎక్కించుకోను'' అంటూ వెల్లడించారు పవన్ కళ్యాణ్.