సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 10 జనవరి 2019 (16:10 IST)

'ఎన్టీఆర్ కథానాయకుడు'పై తమిళ్ రాకర్స్ పంజా.. నెట్‌లో లీక్

స్వర్గీయ ఎన్.టి.రామారావు జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించిన చిత్రం 'ఎన్టీఆర్ కథానాయుడు'. ఈ చిత్రం జనవరి 9వ తేదీ బుధవారం విడులైంది. మంచి టాక్‌తో ప్రదర్శితమవుతోంది. అయితే, ఈ చిత్రం నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. దీనికి కారణం తమిళ్ రాకర్స్. 
 
నిజానికి తమిళ్ రాకర్స్ వెబ్‌సైట్ దెబ్బకు తమిళ చిత్ర నిర్మాతలు బెంబేలెత్తిపోతున్నారు. రజినీకాంత్ వంటి '2.0' చిత్రాన్ని విడుదలకు ముందే లీక్ చేస్తామని సవాల్ విసిరిన తమిళ్ రాకర్స్.. అంతన్నపని చేసింది. 
 
ఇపుడు తెలుగు చిత్రసీమపై దృష్టిసారించింది. వాస్తవానికి ఇప్పటివరకు తెలుగు చిత్రాలపై తమిళ్ రాకర్స్ పెద్దగా దృష్టిసారించింది లేదు. కానీ తొలిసారి 'ఎన్టీఆర్ కథనాయకుడు' చిత్రాన్ని తమిళ్ రాకర్స్ రిలీజ్ చేసింది. గతంలో మద్రాసు హైకోర్టు ఆదేశం మేరకు 12 వేల నకిలీ సైట్స్‌ను నిషేధించారు. వాటిలో ఒకటి తమిళ్ రాకర్స్. 
 
కానీ, హైకోర్టు ఉత్తర్వులు పెద్దగా ప్రభావం చూపలేదు. ఫలితంగా 'ఎన్టీఆర్ కథానాయకుడు'తో పాటు సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం 'పేట' మూవీని ఆ వెబ్‌సైట్ లీక్ చేసినట్టు తెలుస్తోంది.