సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (19:55 IST)

మ‌హేష్ - న‌మ్ర‌త పెళ్లి రోజునాడు ఏం చేసారో తెలుసా..?

మహేష్ బాబు, నమ్రత ఆదివారం తమ 14వ పెళ్లి రోజును జరుపుకున్నారు. మహేష్ బాబు ఓ వైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే.. మ‌రోవైపు సామాజిక, సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొంటుంటారు. భార్య నమ్రతా శిరోద్కర్ సారథ్యంలో మ‌హేష్ ఇప్పటికే చాలా సేవా కార్యక్రమాలు చేపట్టారు.
 
అనాథ పిల్లల కోసం సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇటీవ‌ల‌ గచ్చిబౌలిలో ప్రారంభించిన ఏఎంబీ సినిమాస్‌లో అనాథ పిల్లల కోసం  స్పైడర్ మ్యాన్ సినిమాను ప్రదర్శించారు. ఇప్పుడు తమ పెళ్లిరోజు సందర్భంగా మహేష్, నమ్రత దంపతులు అంధ బాలలకు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. 
 
అవును..అది కూడా 650 మంది అంధ బాలలకు విందు ఏర్పాటు చేశారు. బేగంపేటలోని దేవనార్ స్కూల్ ఆఫ్ బ్లైండ్ విద్యార్థులకు మహేష్ బాబు టీం ఈ విందు ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా బాలలంతా మహేష్, నమ్రత దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు. తమకు ఒకపూట అన్నదానం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.