శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 16 ఫిబ్రవరి 2019 (10:44 IST)

పుల్వామా ఘటన.. అఖిలపక్షానికి పిలుపునిచ్చిన కేంద్రం.. ప్రతీకారం కోసం..?

జమ్మూకాశ్మీర్ పుల్వామా జిల్లాలో ఉగ్రవాద ఆత్మహుతి దాడి ఘటనపై ఎన్ఐఏ నివేదిక విడుదల చేసింది. ఈ దాడికి ఆర్డీఎక్స్ వాడలేదని యూరియా అమ్మోనియం నైట్రేట్‌ను వాడినట్లు పేర్కొన్నారు. క్వారీలలో పెద్దపెద్ద బండరాళ్లను పగలగొట్టేందుకు యూరియా అమ్మోనియం నైట్రేట్‌ను ఉపయోగిస్తారు. ఆ పదార్ధాన్నే 320 కేజీల భారీ మొత్తాన్ని కారులో నింపుకొని జవాన్లు ప్రయాణిస్తున్న వాహనశ్రేణిని ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. 
 
ఈ దుర్ఘటనలో తొలుత 43 మంది జవాన్లు దుర్మరణం చెందినట్లు వార్తలు వచ్చినప్పటికీ మొత్తం 40 మంది జవాన్లు అమరులయ్యారని అధికారులు తేల్చారు. ఈ దుర్ఘటనపై దేశమంతటా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. భవిష్యత్ లో ఇలాంటి కవ్వింపు చర్యలకు దిగకుండా పాకిస్తాన్ కు గట్టిగా బుద్ది చెప్పాలని ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం శనివారం అఖిలపక్ష భేటీకి పిలుపునిచ్చింది.