పుల్వామా ఉగ్రదాడిని ఖండించిన నాట్స్... జవాన్ల కుటుంబానికి సానుభూతి

terror
Last Modified శుక్రవారం, 15 ఫిబ్రవరి 2019 (22:22 IST)
జమ్ముకాశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్ర ఘాతుక ఘటనను ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తీవ్రంగా ఖండిచింది. ఉగ్రవాద దాడిలో
మృతి చెందిన 44మంది జవాన్లను భారతీయులెవరు మరిచిపోలేరని ప్రకటించింది. వారి ప్రాణాలను హరించిన పాక్ తీవ్రవాద మూకలకు భారత్ గట్టి సమాధానం చెబుతుందనే విశ్వాసాన్ని నాట్స్ వ్యక్తం చేసింది.

పుల్వామాలో ఉగ్రదాడి తెలిసిన వెంటనే అమెరికాలో ఉండే తెలుగువారంతా దీనిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జవానుల కుటుంబాలకు నాట్స్ ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలిపింది. ప్రపంచంలో ఉన్న ప్రతి భారతీయుడు జవాన్ల కుటుంబానికి అండగా ఉండాలని పేర్కొంది.దీనిపై మరింత చదవండి :